తొందరగా సినిమా స్టోరీలను రాసి సినిమా తీసి ఇండస్ట్రీ హిట్టు కొట్టే ఒకే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్…టాలీవుడ్ లో ఉన్న ఒక్కరిద్దరు బడా హీరోలని మినిహాయిస్తే ఆల్మోస్ట్ అందరితో సినిమాలు చేసి సక్సెస్ లు సాధించాడు…అసలు పూరి ఎవ్వరి గురించి గాని బ్యాడ్ గా మాట్లాడటం వాళ్ళ మీద కోపానికి రావడం మనం చూసి ఉండము.ఎందుకంటే ఆయన అందరిని డార్లింగ్ అంటూ పిలుస్తూ అందరితో జోవియల్ గా ఉంటాడు.
కానీ పూరి ఒక సందర్భం లో మోహన్ బాబు మీద కొంచం కోపానికి వచ్చినట్లు తెలుస్తుంది.

అది ఎప్పుడంటే పూరి ప్రభాస్ తో బుజ్జిగాడు అనే సినిమా తీసిన విషయం మనకు తెలిసిందే దాంట్లో ఒక కీలక పాత్రలో మోహన్ బాబు నటించాడు.అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మోహన్ బాబు తరుచుగా పూరి జగన్నాథ్ తో మాట్లాడుతూ మా విష్ణు తో ఒక సినిమా చేయి అని చాలా సార్లు అడిగారట దానికి సమాధానం గా పూరి నాకు ఇప్పుడు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అవి పూర్తి అయిన తరువాత పక్క ఒక సినిమా విష్ణు తో చేస్తా అని మోహన్బాబు కి చెప్పాడట అయిన కూడా మెహన్ బాబు వినిపించుకోకుండా తరచు అడుగుతూ ఉంటె పూరి కి చాలా కోపం వచ్చేదట.మళ్ళి ఇంకోరోజు మోహన్ బాబు అడిగిన్నప్పుడు పూరి జగన్నాథ్ కొంచం సీరియస్ అయి మోహన్ బాబు కి కొంచం గట్టిగానే సమాధానం చెప్పాడట.
ప్రస్తుతం పూరి చిరంజీవి తో ఒక సినిమా చేసే పని లో ఉన్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు పూరి…
.