‘NTR30’ లాంఛ్ ఈవెంట్ వాయిదా.. మరో కొత్త తేదీ లాక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియన్ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా తర్వాత ఈయన లైనప్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 Ntr 30 Opening Ceremony Has Been Postponed Again-TeluguStop.com

ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ నుండి కొత్త సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే.ఎన్టీఆర్ మాత్రం మరో కొత్త సినిమా స్టార్ట్ చేయకుండా ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తున్నాడు.

ట్రిపుల్ వచ్చి ఏడాది గడుస్తున్న ఇంకా నెక్స్ట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోయాడు.ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఎన్టీఆర్ కొరటాలతో సినిమా ప్రకటించాడు.

ఈ కాంబోపై అప్పటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఎట్టకేలకు ఈ సినిమాను ఈ నెల 24న గ్రాండ్ గా లాంఛ్ చేయాలని ముహూర్తం ఫిక్స్ చేసారు.

Telugu Janhvi Kapoor, Koratala Shiva, Ntr Koratala, Ntr, Ntr Ceremony, Saif Ali

ఫిబ్రవరి 24న లాంచింగ్ ఉంటుంది అని అంతా భావించారు.అయితే ఈసారి కూడా ఈ లాంఛ్ ఈవెంట్ వాయిదా పడినట్టు తెలుస్తుంది.ఎందుకంటే తారకరత్న హఠాత్తుగా మరణించడం వల్ల మేకర్స్ ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసినట్టు సమాచారం.మరి కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమా ముహూర్తం ఎప్పటికి ఫైనల్ అవుతుందో.

Telugu Janhvi Kapoor, Koratala Shiva, Ntr Koratala, Ntr, Ntr Ceremony, Saif Ali

ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అని అలాగే విలన్ రోల్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఫైనల్ అయినట్టు టాక్.ఇక యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ సినిమాను నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే 2024లో ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube