తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ క్యారెక్టర్ ఇచ్చిన అలవోకగా నటించే సత్తా ఉన్న నటుడు ప్రకాష్ రాజ్..
ఇప్పటివరకు కొన్ని వందల పాత్రల్లో నటించి మెప్పించాడు.నాన్న గా, మామగా, రౌడీ గా, ఫ్రెండ్ గా ఇలా చాలా క్యారెక్టర్స్ లో తన నటన ప్రతిభని చూపించాడు ఇక అలాగే రియల్ స్టార్ శ్రీహరి గారి గురించి చెప్పాలి.
శ్రీహరి ఒకప్పుడు విలన్ గా చేసాడు ఆ తరువాత భద్రాచలం లాంటి సినిమాలో హీరోగా చేసి సక్సెస్ సాధించాడు.ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసాడు.
అనారోగ్య కారణంగా ఆయన కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన విషయం మనకు తెలిసిందే.
అయితే శ్రీహరి ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటులు అనే విషయం మనకు తెలిసిందే అయితే శ్రీహరి భార్య అయిన డిస్కో శాంతి వాళ్ళ అక్కని ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకున్నాడు దాని వల్ల ప్రకాష్ రాజ్ శ్రీహరి ఇద్దరు కూడా తోడి అల్లుళ్ళు అయ్యారు.ఆ తరువాత ప్రకాష్ రాజ్ ఆమెని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక శ్రీహరి వాళ్ళ కొడుకు కూడా హీరోగా ఒక సినిమా చేసారు ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా యాక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ సినిమాల్లో విలన్ గా చేస్తూ మంచి బిజీ గా గడుపుతున్నారు.రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు.
అలాగే రంగ మార్తాండ సినిమాలో ఒక డిఫెరెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఖచ్చితం గా ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తుంది.