ఆర్టీసీ సమ్మె : కేసీఆర్‌ నిర్ణయం ఏంటో?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేందుకు ఓకే చెప్పారు.

అయితే ప్రభుత్వం కండీషన్స్‌ ఏమీ పెట్టకుండా కార్మికులందరిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

బేషరతుగా ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రెండు సార్లు గడువు విధించాడు.ఆ గడువు ముగిసిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీకి చెందిన వారే కాదని, వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న వారు అవుతారంటూ కేసీఆర్‌ ప్రకటించాడు.

ఇలాంటి సమయంలో కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికుల పట్ల ఎలా వ్యవహరిస్తాడు అంటూ అందరు ఎదురు చూస్తున్నారు.మొదటి నుండి కూడా ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్‌ కోపంగానే ఉన్నాడు.

Advertisement

సమ్మె చేయించిన కార్మిక సంఘాల నాయకులు కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.కేసీఆర్‌ను ఆర్టీసీ కార్మికులు ఇష్టానుసారంగా బండ బూతులు తిట్టారు.

అందుకే ఇప్పుడు ఏం అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు