పాకిస్థాన్‌కు చెందిన ఓ వింత ప్రేమకథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది.పాకిస్థాన్‌లోని ఓ ధనిక కుటుంబానికి చెందిన అయేషా అనే మహిళ ఒక మెకానిక్ తో ప్రేమలో పడింది.
ఎందుకంటే అతడు తన వాహనం టైర్ మార్చి తనకు హెల్ప్ చేశాడట.అందుకే అతనితో ప్రేమలో పడి చివరికి అతన్ని పెళ్లి చేసుకుంది.
ఈ టైర్ టెక్నీషియన్ పేరు జిసెన్.రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట ఇటీవల యూట్యూబర్ సయ్యద్ బాసిత్ అలీతో ఆన్‌లైన్‌లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఆ ఇంటర్వ్యూలో అయేషా తాను జిసెన్‌ను ఎలా కలిశానో పూస గుచ్చినట్లు వివరించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.ఆమె మాట్లాడుతూ తన లవ్ స్టోరీ టైర్ పంక్చర్ తో మొదలైందని చెప్పడం ప్రారంభించింది.
టైర్ పంచర్ అయినప్పుడు ఆ టైర్‌ను రిపేర్ చేయించడానికి తాను కొన్ని దుకాణాలకు వెళ్లి అడిగానని చెప్పింది.కానీ ఎవరూ కూడా ఆమెకు హెల్ప్ చేయలేదట.చివరికి ఆమె తన కారును జిసెన్ దుకాణానికి తీసుకెళ్ళింది.ఈ వాహనాన్ని చూసిన వెంటనే తన షాప్‌లోని వర్కర్స్‌ను టైర్ చెక్ చేయమని జిసెన్ కోరాడు.అయేషాకి టీ అందించి మర్యాదలు చేశాడు.అలాగే టైర్ బాగు చేశాడు.అతను చూపించిన మర్యాద అలాగే సర్వీస్ ఆమెను బాగా ఇంప్రెస్ చేసింది.
దాంతో ఆమె తన వాహనాన్ని కావాలనే పంచర్ చేసి అతని షాప్ కి ఎప్పుడూ తీసుకెళ్లేది.ప్రతిసారీ అతడి ప్రవర్తన ఆమెకు ఎంతగానో నచ్చింది.అందుకే ఆమె అతడి పై ప్రేమ పెంచుకుంది చివరికి అతడినే పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఈ లవ్ స్టోరీ గురించి తెలుసుకున్న చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.నిజానికి ఆ మెకానిక్ కూడా ఆమె మొదటిగా తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు నమ్మలేకపోయాడు.చివరికి ఆమె ప్రియ నిజమని తెలుసుకొని అతను సంతోషించాడట.