సినిమా ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు వరుసగా సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఆయన కంటు ఒక సపరెట్ క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.
అయితే ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన ఒక సినిమా చిరంజీవి( Chiranjeevi ) వల్ల ఆగిపోయింది అనే విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

అది ఏంటంటే చిరంజీవితో మాస్టర్, డాడీ లాంటి సినిమాలు తీసిన సురేష్ కృష్ణ( Suresh Krishna ) పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు.ఇక అదే క్రమంలో పవన్ కళ్యాణ్ కి ఒక కథ కూడా చెప్పాడు.అది రివెంజ్ బ్యాక్ డ్రాప్ లో( Revenge Backdrop ) నడిచే స్టోరీ కావడం వల్ల పవన్ కళ్యాణ్ కి కూడా బాగా నచ్చింది.
అయితే ఆ సినిమా స్టోరీ ని ఒకసారి అన్నయ్య (చిరంజీవి)కి చెప్పమని పవన్ కళ్యాణ్ సురేష్ కృష్ణ కి చెప్పగా సురేష్ కృష్ణ వెంటనే చిరంజీవికి ఆ కథ వినిపించాడట.అయితే కథ బాగుంది కానీ ఇది పవన్ కళ్యాణ్ కి సెట్ అవ్వదు అని ఆ ప్రాజెక్టుని పవన్ కళ్యాణ్ చేయకుండా చిరంజీవి ఆపేసాడట.

దాంతో పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు చిరంజీవి మీద కొంచెం కోపం తో ఉన్నాడట, ఆ తర్వాత సురేష్ కృష్ణ ఈ ప్రాజెక్టును వేరే వాళ్ళతో చేసి పెద్ద ప్లాప్ ను అయితే మూట గట్టుకున్నాడు.ఇక పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ ను చేయాల్సింది కానీ చిరంజీవి మీద గౌరవంతో ఈ సినిమాని వదిలేశాడు.ఆ తర్వాత వేరే హీరోతో ఈ సినిమా చేసినప్పటికీ అది ప్లాప్ అవ్వడంతో చిరంజీవి జడ్జిమెంట్ చాలా గొప్పదని పవన్ కళ్యాణ్ అనుకున్నాడట…
.







