కర్నాటక దెబ్బకు.. బీజేపీ థింకింగ్ మారే !

కర్నాటక ఎన్నికల ప్రభావం బీజేపీని( BJP ) గట్టిగానే దెబ్బ తీసింది.

కచ్చితంగా గెలుస్తామని కుండ బద్దలు కొట్టిన కమలనాథులకు కన్నడిగులు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు.

దీంతో బీజేపీ నేతల థింకింగ్ మారిపోయినట్లు తెలుస్తోంది.ఇప్పుడు కమలనాథుల దృష్టంతా తెలంగాణ పై పడింది.

కర్నాటక మాదిరి వైఫల్యం తెలంగాణలో ఎదుర్కొకూడదని బీజేపీ పెద్దలు ఇప్పటి నుంచే లోటుపాట్లను సరి చేసుకునే పనిలో ఉన్నారు.ముఖ్యంగా పార్టీని ముందుకు నడిపించే నాయకుడి విషయంలో బీజేపీ ఇప్పుడు పునఃఆలోచిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్( Bandi Sanjay ) కొనసాగుతున్నారు.అయితే బండి దూకుడు స్వభావం ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసి చిక్కులు కొని తెస్తారో ఊహించలేని పరిస్థితి.కొన్ని సార్లు బండిసంజయ్ చేసే వ్యాఖ్యలు పార్టీ అధిష్టానాన్ని కూడా కలవరపరుస్తుంటాయి.

Advertisement

దీంతో బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించే అవకాశం ఉందని ఎన్నో రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈసారి ఎన్నికల వరకు బండినే కొనసాగించాలని అధిష్టానం భావించింది.

తీర ఇప్పుడు కర్నాటక ఎన్నికల్లో ఘోర ఓటమితో బీజేపీ థింకింగ్ లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించి.ఈటెల రాజేందర్ కు ఆ బాద్యతలు అప్పగించే దిశగా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలకు బలం చేకూర్చేలా.ఇటీవల ఈటెల రాజేందర్ కు డిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కాదని ఈటెల కు పిలుపు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.

అయితే డిల్లీ పెద్దలు ఈటెల తో( Etela Rajender ) ఎందుకు సమావేశం అయ్యారు ? ఆయన తో ఏం చర్చించారు ? అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.అయితే ఈటెల డిల్లీ ప్రయాణంపై బండి సంజయ్ ఆసక్తికరంగా స్పందించారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఈటెల ను అధిష్టానం ఎందుకు పిలిచిందో తనకు తెలియదని, తాను మాత్రం పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.ఒకవేళ ఎన్నికల ముందు రాష్ట్ర అద్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పిస్తే.

Advertisement

ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా ఆసక్తికరమే.మొత్తానికి కర్నాటక ఇచ్చిన స్ట్రోక్ తో బీజేపీ తెలంగాణపై మరింత జాగ్రత్తగా అగుడులు వేస్తుందనే చెప్పవచ్చు.

తాజా వార్తలు