తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్( BRS )ప్రతిపక్ష బీజేపీ( BJP ) మద్య రాజకీయ పోరు రసవత్తరంగా సాగుతోంది.బిఆర్‌ఎస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ ఒకడుగు ముందుకెస్తే.
బిఆర్‌ఎస్ రెండడుగులు ముందుకెస్తోంది.దీంతో ఈ రెండు పార్టీల మద్య జరుగుతోన్న రగడ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది.
నిత్యం ఈ రెండు పార్టీల మద్య ఏదొక వివాదం తరచూ చర్చకు వస్తూనే ఉంది.ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఈడీ దాడులు.
తాజాగా ప్రశ్న పత్రాల లీకేజ్ ఇలా ప్రతిదీ కూడా పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గానే మారుతోంది.కాగా ప్రస్తుతం ఈ రెండు పార్టీల మద్య జరుగుతోన్న ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్( Bandi Sanjay ) కీలక పాత్రధారి అని కేసిఆర్ సర్కార్ ( KCR Sarkar )సంజయ్ ని అరెస్ట్ చేసింది.

అయితే ఇదంతా కేసిఆర్ కక్ష పూరిత వ్యవహారమే అంటూ మరోవైపు కమలనాథులు మండి పడుతున్నారు.అయితే ఎందులో ఎవరిపాత్ర ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ వ్యవహారంలో అరెస్త్గ్ కావడమే ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం.ఒకవేళ ఈ నేరం నిరూపణ అయితే బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఎందుకంటే విధ్యార్థుల భవిష్యత్ కు సంబంధింకిన వ్యవహారం కావడంతో అన్నీ వైపులా నుంచి కమలనాథులపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది.మొత్తానికి ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం బీజేపీని డిఫెన్స్ లోకి నేట్టిందనే చెప్పాలి.

దీంతో ఇదే స్థాయిలో కేసిఆర్ ను దెబ్బ తీసేందుకు బీజేపీ నేతలు కూడా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే డిల్లీ లిక్కర్ స్కామ్ తో బిఆర్‌ఎస్ నేతలను గట్టిగానే టార్గెట్ చేసింది డిల్లీ అధిస్థానం.ఇక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన కుంభకోణలు, ఇంకా కేసిఆర్ పాలనలో జరిగిన ఇతరత్రా స్కామ్ లు కూడా బయటకు తవ్వి కేసిఆర్ ను జైలుకు పంపే విధంగా డిల్లీ అధిస్థానం వ్యూహాలు రచించే అవకాశం ఉంది.మరో ఆరు నెలల్లో కేసిఆర్ కుటంబం ఫామ్ హౌస్ కు వెళుతుందని, కుటుంబం మొత్తం జైలు కు పోవడం ఖాయం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే బీజేపీ గట్టిగానే యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.మరి ముందు రోజుల్లో ఈ రెండు పార్టీల మద్య దెబ్బకు దెబ్బ వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.







