ఆ దర్శకునికి ఐలవ్యూ చెప్పిన హీరోయిన్ సమంత.. ఎందుకు చెప్పారంటే?

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) తన మనస్సులోని భావాలను దాచుకోకుండా వెల్లడించడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.సమంత కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో మజిలీ సినిమా( Majili Movie ) కూడా ఒకటి.

 Samantha Says I Love You To Shiva Nirvana Details, Samantha, Khushi, Director Sh-TeluguStop.com

ఈ సినిమాలో సమంత పోషించిన శ్రావణి పాత్ర ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేసింది.నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా చైతన్య కెరీర్ లో సైతం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

అయితే మజిలీ సినిమా విడుదలై నాలుగేళ్లు పూర్తి కావడంతో ఐ లవ్ యూ శివ నిర్వాణ అంటూ( Director Shiva Nirvana ) కృతజ్ఞతను చాటుకున్నారు.తనకు శ్రావణి పాత్రలో నటించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని ఆమె అన్నారు.

ఖుషి సినిమాలో ఆరాధ్య పాత్రతో అదరగొడదామని సమంత వెల్లడించడం గమనార్హం.అయితే మజిలీ సినిమా సక్సెస్ లో చైతన్య పాత్ర కూడా ఉన్నా చైతన్య పేరు వెల్లడించడానికి మాత్రం ఆమె అస్సలు ఇష్టపడలేదు.

చైతన్య సమంత కాంబోలో ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలలో మూడు సినిమాలు సక్సెస్ సాధించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది.అయితే ఈ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో కూడా సినిమాలు వచ్చే అవకాశం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సమంత చైతన్య విషయంలో చాలా కోపంగా ఉన్నారు.విడాకుల విషయంలో కూడా ఘాటుగా స్పందిస్తున్నారు.

చైసామ్ మళ్లీ కలుస్తారని ఫ్యాన్స్ భావించినా ఆ విధంగా జరగలేదు.చైతన్య సమంత క్యూట్ జోడీ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.సామ్ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.సమంత రెమ్యునరేషన్ రికార్డ్ స్థాయిలో ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube