కేంద్రం చేనేత రంగ కార్మికులకు ఏం చేసిందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో చేనేత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.దానిలో భాగంగానే రూ.350 కోట్ల నిధులతో బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చామన్నారు.కానీ కేంద్రం కార్మికులను రోడ్డున పడేసిందని ఆరోపించారు.
ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్, పవర్ లూమ్ బోర్డులను రద్దు చేసిందని విమర్శించారు.అదేవిధంగా మెగా టెక్స్ టైల్ కు రూపాయి కూడా సాయం చేయలేదని ఎద్దేవా చేశారు.
బీజేపీది రద్దుల ప్రభుత్వం అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.