అమెరికాకి ఏమయ్యింది...మూతపడుతున్న విశిష్ట రంగాలు..!!!

అమెరికా వాసులకి క్రిస్మస్ రోజుల్లో గట్టి షాక్ ఇస్తోంది ప్రభుత్వం.పాలన మొత్తం ఒక్క సారిగా స్తంభించి పోయింది.

ట్రంప్ ప్రతిపాదించిన బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాక్షికంగా ప్రభుత్వ రంగాలని ఒక్కొక్కటిగా మూసేయవాల్సి వస్తోంది.మెక్సికో దగ్గర గోడని నిర్మించేందుకు కావాల్సిన వ్యయ బిల్లులో 5 బిలియన్ల డాలర్లు కేటాయించాలని ట్రంప్‌ ప్రతిపాదించారు.

అయితే ఈ ప్రతిపాదన నుంచీ వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.దీంతో వ్యయ బిల్లుకి కాంగ్రెస్‌ సభలో బ్రేక్ పడింది.గత రెండేళ్లలో ఇలా ప్రభుత్వం స్తంభించడం ఇది మూడవసారి కావడం విశేషం.

మొత్తం తొమ్మిది ఫెడరల్‌ శాఖలు తమ పనిని ఈ క్రమంలో ఆపేస్తున్నాయి.వీటితో పాటు మరికొన్ని ఏజెన్సీలు కూడా తమ కార్యకలాపాలను ఆపేస్తాయి.

Advertisement

దాంతో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రభావం పడుతోంది అంతేకాదు ఈ బిల్లు వాయిదా పడడంతో దేశవ్యాప్తంగా హోమ్‌ల్యాండ్‌ సెక్యూర్టీ,.ట్రాన్స్‌పోర్టేషన్‌.

అగ్రికల్చర్‌.స్టేట్‌ అండ్‌ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్లను మూసేస్తున్నారు అంతేకాదు పార్కులు, అడువులని సైతం మూసేయడం జరుగుతుందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు