చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నా … గుర్తులేని పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న జనసేన పార్టీ ఎట్టకేలకు ఎన్నికల ముందు పార్టీకి ఎన్నికల గుర్తు సంపాదించేసుకుంది.ఈ మేరకు ఈసీ జనసేనకు ఎన్నికల గుర్తు కేటాయించింది.
గాజు గ్లాసు జనసేన గుర్తు.టీ గాజు గ్లాసు సింబల్‌ను జనసేనకు కేటాయించినట్టు ఆ పార్టీ తన ట్వీట్టర్‌లో వెల్లడించింది.
గుర్తును జనంలోకి తీసుకెళ్లాలనని అభిమానులను ఆ పార్టీ కోరింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయనుంది.ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.సంక్రాంతి తరువాత పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడంతో పాటు అమరావతిలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు.
ఇక ఎన్నికల గుర్తు కూడా వచ్చెయ్యడంతో… ఇక మరింత వేగంగా… ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ సిద్ధం అవుతోంది.







