ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ఏం అవుతుంది?

నేటి సమాజంలో పెళ్లి జరగడమంటే మామూలు విషయం కాదు.వధువు లేదా వరుడు కి సంబంధించిన విషయాల్లో ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటారు.

వరుడుని చూసినప్పుడు అతను ఎలాంటి వాడు, ఏం చేస్తాడు, సంపాదనెంతా, మంచి వ్యక్తిత్వమేనా, కుటుంబం మంచిదేనా అని ఆరా తీసి మరీ పెళ్లికి సిద్ధమవుతుంటారు.మరీ ముఖ్యంగా ఆరోగ్య విషయాలను కూడా కనుక్కుంటూ ఉంటారు.

అయితే చాలా మటుకు మేనరికాల మూలంగా వారికి పుట్టబోయే పిల్లల్లో లోపాలు ఏర్పడతాయని వైద్యులు తెలుపుతుంటారు.అయినా కాని కొందరు మేనరికం పెళ్లిల్లకే మొగ్గుచూపుతుంటారు.

ఫలితం పిల్లల్లో లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం వధువు, వరుడు బ్లడ్ గ్రూప్ ల విషయాల్లో కూడా చాలా మంది టెన్షన్ పడుతుంటారు.

Advertisement

వారిరువురిదీ ఒకే బ్లడ్ గ్రూప్ అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయోననీ తెగ హైరానా పడిపోతుంటూ ఉంటారు.దానికి సంబంధించి డాక్టర్లను కూడా సంప్రదిస్తూ వారి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కాగా సాంకేతికపరంగా మనం ఎంతముందుకు వెళుతున్నా కొందరు మాత్రం అవగాహన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.ఇలాంటి వారు చాలా మందే ఉంటారు.

చిన్న చిన్న విషయాలకు భయపడిపోతూ ఉంటారు.వీరి సందేహాలతో అవతల వ్యక్తులను గందరగోళానికి గురి చేస్తుంటారు.

ఇలాంటి విషయంతోనే జనాలు ఈ మధ్య తెగ భయబ్రాంతులకు గురవుతున్నారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
వేరుశ‌న‌గ‌లను ఇలా తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి వెయిట్ లాస్ వ‌ర‌కు మ‌స్తు బెనిఫిట్స్‌!

ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు వివాహం చేసుకుంటే ఆ ఆరోగ్య సమస్య తలెత్తుతుందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాల్లోనే చాలా మంది యువతీయువకులు వైద్యులను సంప్రదిస్తున్నారు.కాగా ఒకే రకం బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు పెళ్లి చేసుకున్నా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

అయితే వేరే వేరే బ్లడ్ గ్రూప్ లు కలిగిన వ్యక్తులు పెళ్లి చేసుకున్నా లేదా ఒకే రకం బ్లడ్ గ్రూప్ లు కలిగిన వ్యక్తులు పెళ్లి చేసుకున్నా వచ్చే నష్టమేమీ లేదని డాక్టర్లు అవగాహన కల్పిస్తున్నారు.అయితే ఒకే బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ఏవో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనేది వాస్తవం కాదని అది కేవలం మీ అవగాహన లోపమేనని డాక్టర్లు తెలుపుతున్నారు.

అయితే భార్యాభర్తలిద్దరిదీ ఒకే రకం బ్లడ్ గ్రూప్ అయితే మాత్రం తమ పిల్లలకు కూడా అదే బ్లడ్ గ్రూప్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.అలాగే తల్లిదండ్రులిద్దరిదీ వేరు వేరు బ్లడ్ గ్రూప్ లు అయితే మాత్రం పిల్లలకు వారిరువురిలో ఎవరిదో ఒకరిది బ్లడ్ గ్రూప్ వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

తల్లి బ్లడ్ గ్రూప్ కంటే తండ్రి వారసత్వంగా బ్లడ్ గ్రూప్ వచ్చిన పిల్లలకు ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు వెళ్లడించిన సంగతి తెలిసిందే.అయితే సేమ్ బ్లడ్ గ్రూప్ అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలే లేవని డాక్టర్లు, నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు