టీడీపీకి ఏమైంది.. ఏంటి ఈ పనులు ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్ అయిన తరువాత ఆ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.సరైన టైంలో సరైన నిర్ణయలు తీసుకునే నాయకుడు లేని లోటు పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.

 What Happened To Tdp What Are These Things , Chandrababu Naidu, Tdp, Nara Lokesh-TeluguStop.com

బాబు అరెస్ట్ తరువాత పార్టీకి సంబంధించిన వ్యూహ రచన, నిర్ణయాలు.నారా లోకేశ్( Nara Lokesh ) మరియు నందమూరి బాలకృష్ణ చూసుకుంటున్నారు.

ఇద్దరు కూడా పరిణితి లేని నాయకులు కాకపోవడంతో వారు తీసుకుంటున్న నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి.చంద్రబాబు అరెస్ట్ ను సింపతీగా మార్చుకునేందుకు ప్రస్తుతం టీడీపీ వేస్తున్న ప్రణాళికలు హాస్యాస్పదంగా ఉంటున్నాయనేది వైసీపీ నేతలు చేస్తున్న విమర్శ.

Telugu Chandrababu, Lokesh, Tdp-Politics

నిన్నటి వరకు మోత మోగిద్దాం అంటూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఏవేవో వస్తువుల ద్వారా శబ్ధం చేసే ప్రయత్నం చేశారు.టీడీపీ నేతలు( TDP leaders ) చేసిన ఆ చర్యలపై హాస్యాస్పద విమర్శలు వ్యక్తమయ్యాయి.అరెస్ట్ అయిన బాబును నిర్ధోషిగా నిరూపించుకోకుండా ఇలా శబ్దాలు చేయడం ఎంటనే విమర్శ ప్రధానంగా వ్యక్తమైంది.ఇక తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టీడీపీ నేతలు.

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రేపు రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి బయటకు వచ్చి 5 నిముషాలు టార్చ్ లైట్లు గాని, ఫ్లాష్ లైట్స్ గాని వెలిగించాలని తాజాగా లోకేశ్ పిలుపునిచ్చారు.

Telugu Chandrababu, Lokesh, Tdp-Politics

దీంతో ఏంటి ఈ పనులు అంటూ ప్రత్యర్థి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.చంద్రబాబు పక్కా ఆధారాలతో దొరికిపోయడాని, ఇలా ఎన్ని హాస్యాస్పద పనులు చేసిన ప్రజా మద్దతు పొందడం కష్టమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.వీలైతే నిర్ధోషిగా నిరూపించుకోవాలని.

ఇలా అర్థం లేని పనులు ఎన్ని చేసిన వ్యర్థమే అనేది వైసీపీ వారు చేస్తున్న మాట.ఇదిలా ఉంచితే చంద్రబౌబ్ విషయంలో మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ( ACB Court )తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.ఇక ముందస్తు బెయిల్ విషయంలో నేడు తుది తీర్పు ఇవ్వనుంది ధర్మాసనం.మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube