తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలు ఉన్న ఫ్యామిలీ ఏది అనగానే ఠక్కున వినిపించే పేరు మెగా ఫ్యామిలీ. ఈ ఒక్క ఫ్యామిలీ లోనే దాదాపు డజను మంది హీరోల వరకు ఉండటంతో ఏడాదిలో వీరు నటించిన ఏదో ఒక సినిమా థియేటర్లలో సందడి చేస్తూ తమ అభిమానులకు అధిక ఉత్సాహాన్ని ఇస్తుంటారు.
అయితే గడిచిన రెండేళ్లలో కరోనా కారణంగా ఎక్కువ సినిమాలు విడుదల కాకపోవటం, విడుదలైన కొన్ని సినిమాలు కూడా అనుకున్నంతగా రాణించకపోవటంతో మెగా ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారని తెలుస్తోంది.దీనితో మెగా హీరోలకి ఏమైంది అని తెగ కంగారు పడిపోతున్నారు.
మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పవన్ చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ‘వకీల్ సాబ్’.
ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ క్రేజ్ వల్ల హిట్ అయినప్పటికీ చాలా ఏరియాల్లో బయ్యర్లకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తుంది.అదే తరహాలో మెగా మేనల్లుడు అయినా సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ‘రిపబ్లిక్’ వంటి రెండు సినిమాలు కూడా బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్ ను అందుకున్నాయి.
ఇక అయన సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా ‘కొండపొలం’ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఆ తర్వాత సంక్రాంతికి ‘సూపర్ మచ్చి’ తో ఎంట్రీ ఇచ్చిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్లాప్ తో సరిపెట్టుకున్నాడు.

ఇదే విధంగా ఈ ఏడాది లో రిలీజ్ అయిన ‘భీమ్లా నాయక్’ కూడా మలయాళ రీమేక్ గా తెరకెక్కినప్పటికీ హిట్ టాక్ తోపాటు పాజిటివ్ రివ్యూలు రేటింగులు అందుకుంది.భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.ఫైనల్ రన్ లో అబౌ యావరేజ్ గా నిలిచింది.
అయితే ఇటీవల వచ్చిన ‘ఆచార్య’ సినిమా కూడా ఇప్పుడు డిజాస్టర్ దిశగా పయనిస్తూ , మిశ్రమ స్పందనతో ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.
అంతే కాదు బాక్సాఫీస్ వద్ద వచ్చిన వసూళ్ళు చూసిన మెగా అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.ఇదే తరహాలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమా భారీ ప్లాప్ అందుకున్న సంగతి తెలిసిందే.

మధ్యలో రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నా.అది తన ఒక్కడి క్రెడిట్ కిందకి రాదనే సంగతి తెలిసిందే.దీనితో అసలు మెగా హీరోలకి ఏమైంది, వారు చేసిన సినిమాలు ఎందుకు హిట్ ను అందుకోలేకపోతున్నాయి అంటూ మెగా అభిమానులంతా నిరుత్సాహంతో తలలు పట్టుకుంటున్నారు.కాగా రాబోయే కాలంలో వారు తీయబోయే సినిమాలు అయినా బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తాని చాటాలి అంటూ మెగా అభిమానులు కోరుకుంటున్నారు.