బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి ఏమైంది ? నాలుగేళ్లుగా వెండి తెరపై ఎక్కడ కనిపించలేదు.అంతకు ముందు కూడా అన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.
తమ అభిమాన హీరో ఎప్పుడు సినిమాతో తమ ముందుకు వస్తాడా అని అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు పఠాన్ సినిమాతో కం బ్యాక్ ఇవ్వడానికి నాలుగేళ్ల తర్వాత రెడీ అయ్యాడు షారుక్.
ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా దీపికా పదుకొనే హీరోయిన్.ఇందులో జాన్ అబ్రహం కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.
యాష్ రాజ్ ఫిలిమ్స్ వంటి ఒక అగ్ర నిర్మాణ సంస్థ దీన్ని నిర్మిస్తుంది.
ఆ మధ్య కాలంలో దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది.
టీజర్ చూసాక ఇదొక థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీ అని అర్ధం అయ్యింది.దాంతో ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న షారుక్ ఖాన్ ఫ్యాన్స్ కి జనవరి 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతు గుడ్ న్యూస్ చెప్పరు మేకర్స్.
ఇక ఈ సినిమా ఎనిమిది దేశాల్లో ముగ్గురు సూపర్ స్టార్స్ తో తీస్తున్నారు.యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఇటలీ, స్పెయిన్, టర్కీ, రష్యా, సెర్బియాల్లో, UEA, ఆఫ్ఘన్ వంటి దేశాల్లో చిత్రీకరిస్తున్నారు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.
అయితే నిన్నటికి నిన్న ఒక పాట విడుదల చేశారు.అయితే ఈ పాటతో షారుఖ్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.కొన్ని అగ్లీ మూమెంట్స్ అలాగే డర్టీ డ్రెస్సింగ్ కూడా ఉందని సినీ అభిమానులు బాధపడుతున్నారు.
దీపికకు పెళ్లయింది, పెళ్లయిన తర్వాత మరీ బోల్డ్ పాత్రలను ఎంచుకుంటుంది.ఆ మధ్యకాలంలో వచ్చిన గిహారాయియా సినిమాలో సిద్ధాంత్ తో ఆమె చేసిన ఇంటిమేట్ సీన్స్ కి అందరూ నిర్ధాంత పోయారు.
సినిమా అంటే కాస్త ఎక్స్పోజింగ్ ఉండచ్చు కానీ మరి డర్టీ గా మారితేనే అది ఒక భూతుల తయారవుతుంది.
ఒంటిని 10% కూడా కవర్ చేయని దీపికా బట్టలు, వెగటు పుట్టించే అంగంగా ప్రదర్శన ఆమె పై ఉన్న ఇమేజ్ ని పోగొడుతున్నాయి.ఇక షారుక్ ఖాన్ తో దీపికా పాట చూసిన వారంతా కూడా నోరెళ్ళ పెడుతున్నారు.అసలు షారుఖ్ ఖాన్ ఈ పాత్రను ఎందుకు ఒప్పుకున్నాడు అని ప్రశ్న అందరికీ వస్తుంది అలాగే దీపికా సైతం ఎలాంటి కండిషన్స్ లేకుండా బట్టలు విప్పడానికి ఒప్పుకోవడం చూస్తుంటే బాలీవుడ్ కి ఏమైంది అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఇక మనం దరిద్రానికి తోడు తెలుగులో ఈ పాటను చూడ్డానికి చాలా రోతగా ఉంది.