వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని అధికార పార్టీ వైసిపి( YCP ) ఇప్పటికే ప్రకటన చేసింది.తాము ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని, ప్రత్యర్థులంతా మూకుమ్మడిగా వచ్చినా, విజయం తమదేనని వైసిపి ధీమా గానే చెబుతుండగా , బిజెపి జనసేన లు ఇప్పటికే పొత్తు కొనసాగిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుండగా, బిజెపి దానికి విముఖత చూపిస్తోంది.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మాత్రం టిడిపిని కూడా కలుపుకుని వెళ్లే విధంగా పరోక్షంగా అనేకసార్లు స్పందించారు.
తాజాగా ఈ పొత్తుల అంశంపై పవన్ స్పందించారు.విశాఖలో వారాహి యాత్ర సందర్భంగా ఈరోజు మీడియాతో మాట్లాడిన పవన్ ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చారు .

ఈ పొత్తుల అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, టిడిపి, జనసేన( TDP, Jana Sena ) కూటమిగా వెళ్తుందా ? టిడిపి ,జనసేన ,బిజెపి , కుటమిగా వెళ్తుందా అన్న దానిపై ఇంకా చర్చలు పూర్తి కాలేదని, త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని పవన్ ప్రకటించారు.అలాగే ముఖ్య మంత్రి పదవి పైన తాను ఇప్పటికే స్పష్టం చేశానని, ముఖ్య మంత్రి పదవి వస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అది బలాబలాలను బట్టి నిర్ణయం అవుతుందని , ఎన్నికల తర్వాతే ఈ విషయంపై తాను మాట్లాడుతానని పవన్ అన్నారు.ఇప్పటికే టీడీపీతో కలిసి వెళ్లే విధంగా పవన్ నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున వైసిపి ప్రచారం చేస్తోంది.

అయితే టిడిపి విషయంలో బిజెపి సానుకూలంగా లేకపోయినా, ఆ పార్టీ పెద్దలను ఒప్పించి ఎన్నికల సమయం నాటికి టిడిపిని కలుపుకు వెళ్లాలనే విధంగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.చంద్రబాబు( Chandrababu ) సైతం బిజెపి పెద్దలను ఈ విషయంలో ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.ఎన్నికల సమయం నాటికి దీనిపై ఒక క్లారిటీ రాబోతుంది.
అలాగే సీట్ల పంపకం విషయంలోనూ, కీలక పదవులు విషయంలోనూ జనసేనకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా చంద్రబాబు సానుకూలంగానే ఉండడంతో, వచ్చే ఎన్నికల్లో బిజెపి కాదన్న, టిడిపి జనసేన కలిసి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.







