ఈడీ నోటీసులపై కవిత ఏమన్నారంటే.. ?

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో మొదటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్థానకు వస్తోంది.తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చారు.

 What Does Kavitha Say About Ed Notices ,delhi Likker Scam, Kalvakuntla Kavitha,-TeluguStop.com

త్వరలోనే ఈ వ్యవహారంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.ఇదిలా ఉంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు తాజాగా ఇచ్చిన నోటీసులపై కవిత స్పందించారు.

లిక్కర్ స్కాం వ్యవహారంలో తాను చేసింది ఏమీ లేదని, తాను దేనికి భయపడను అంటూ కవిత స్పందించారు.

Telugu Arunramachandra, Brs, Directaret, Mlc Kavitha, Telangana-Politics

” ఢిల్లీ లిక్కర్ స్కాం లో నేను చేసింది ఏం లేదు.విచారణకు పూర్తిగా సహకరిస్తా.నేను దేనికి భయపడను.

అరెస్ట్ చేస్తే ప్రజల దగ్గరికి వెళ్తా అంటూ కవిత మాట్లాడారు.అలాగే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నేను ఫోన్లు ధ్వంసం చేయలేదు.

అడిగితే ఫోన్లు కూడా ఇస్తా.గతంలో ఈ స్కామ్ కు సంబంధించి ఆరు గంటల పాటు సిబిఐ అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చా అంటూ కవిత చెప్పుకొచ్చారు.

బిజెపి టార్గెట్ తాను కాదని, కేసీఆర్ అని కవిత అన్నారు.జైలుకు పంపిస్తే తానేమి చేయలేనని, ఇందులో తన పాత్ర ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు.

  ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు.

Telugu Arunramachandra, Brs, Directaret, Mlc Kavitha, Telangana-Politics

ఢిల్లీలో విచారణకు రావలసిందిగా పేర్కొన్నారు.ఇక ఈ వ్యవహారంలో హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళై ను ఈడి అధికారులు నిన్ననే అరెస్టు చేశారు.సౌత్ గ్రూప్ కు పిళ్లే ప్రతినిధి అని, కేవలం కవిత ప్రయోజనాల కోసమే పని చేశారని ఈడి అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.ఈనెల 10వ తేదీన ఢిల్లీలో కవిత ధర్నాకు పిలుపునిచ్చారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టగా, తాజాగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే కవితకు ఈడీ అధికారులు నోటీసు ఇవ్వడం.

ఆమె విచారణకు హాజరు కాబోతూ ఉండడంతో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లే దారులన్నిటిని మూసివేసి భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube