చంద్రబాబు అరెస్ట్ పై హీరో సుమన్ ఏమన్నారంటే.. ?

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) పై ఇప్పటికే అనేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి.చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని ఇంత  దారుణంగా అరెస్టు చేస్తారా అంటూ టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగుతున్నాయి.చంద్రబాబు తప్పు చేశారని అందుకే ఆయన అరెస్టయ్యానని వైసిపి నాయకులు( YCP ) కౌంటర్లు ఇస్తున్నార

 What Does Hero Suman Say About Chandrababu's Arrest , Chandrababu Arrest,  Tdp,-TeluguStop.com

Telugu Ap Cm Jagan, Chandrababu, Suman, Skill Scam, Ysrcp-Politics

ఇక టాలీవుడ్ నుంచి దీనిపై పెద్దగా స్పందన కనిపించడం లేదు.దర్శకుడు కె.రాఘవేంద్రరావు తో పాటు , మరి కొద్ది మంది మాత్రమే ఈ అరెస్టు వ్యవహారంపై స్పందించగా ,  మిగతా వారంతా సైలెంట్ గా ఉన్నారు.ఏపీ రాజకీయాల్లోకి తమను లాగ వద్దని, అక్కడ వ్యవహారాలపై స్పందించవద్దు అని సినీ పరిశ్రమకు చెందిన నిర్మాత సురేష్ బాబు సూచించారు.

ఇదిలా ఉంటే.తాజాగా సినీ హీరో సుమన్( Hero Suman ) చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై స్పందించారు.

Telugu Ap Cm Jagan, Chandrababu, Suman, Skill Scam, Ysrcp-Politics

రాజకీయాల్లో ఇదొక గుణపాఠం అని సుమన్ ( Hero Suman )అన్నారు.ఈరోజు ఫిలిం ఛాంబర్ లో  నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సుమన్ చంద్రబాబుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.” చంద్రబాబు డేట్ అఫ్ బర్త్ కరెక్ట్ గా చూసి చెప్పే జ్యోతిష్కుడు ఉంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలుస్తుంది.టైం అనేది బాగుంటే లోకల్ కోర్టులో కూడా అన్ని అనుకూలంగానే జరుగుతాయి.

ఆయనకు అన్ని అనుకూలంగా వచ్చే వరకు జైలులోనే ఉంటారు.మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసేటప్పుడు అన్ని ఆలోచించాకే అరెస్ట్ చేసి ఉంటారు.

సీఎం వైఎస్ జగన్ వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లాడు అంటున్నారు.కానీ అది నిజం కాదు.

ఆయన్ను అరెస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉండి ఉంటాయి .సమయం మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి” అంటూ సుమన్ కామెంట్స్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube