టీఎస్పీఎస్సీ ద్వారా 310 మంది ఫార్మాసిస్టులకు నియామక పత్రాలు..: మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రగతి నివేదిక విడుదలైంది.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రగతి నివేదికను మంత్రి హరీశ్ రావు విడుదల చేశారు.

 Recruitment Documents For 310 Pharmacists Through Tspsc..: Minister Harish Rao-TeluguStop.com

టీఎస్పీఎస్సీ ద్వారా 310 మంది ఫార్మాసిస్టులకు నియామక పత్రాలు అందించిన మంత్రి హరీశ్ రావు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 22,600 మందికి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చామన్నారు.మరో 7,091 మందికి ఉద్యోగాల నియామకాలు తుది దశలో ఉన్నాయని చెప్పారు.

స్టాఫ్ నర్సులకు కూడా త్వరలో నియామక పత్రాలు ఇవ్వబోతున్నామన్నారు.ఇవాళ పదేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేశామని తెలిపారు.2014లో దేశంలో మనం 11వ స్థానంలో ఉన్నామన్న మంత్రి హరీశ్ రావు ఇప్పుడు మూడవ స్థానంలోకి వచ్చామని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే మొదటి స్థానానికి వచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

వైద్య కళాశాలలను 20 నుంచి 56కు పెంచామన్న ఆయన నర్సింగ్ కాలేజీలను 74 నుంచి 106కి పెంచుకున్నామని తెలిపారు.తల్లి, శిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించామని వెల్లడించారు.

అదేవిధంగా జిల్లా కేంద్రాలతో కలిపి 82 డయాలసిస్ కేంద్రాలు పెట్టామన్నారు.ప్రతి నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ పెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube