కొన్ని ఘటనలు చూస్తుంటే అసలు మానవత్వం బ్రతికే ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది.ఎందుకంటే ఆ సంఘటనలు చూస్తుంటే అసలు ఇంట్లో వారిని కూడా ఇలా చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి.
ఇక ఇప్పటికే తల్లిదండ్రులను చంపుతున్న పిల్లలు లేదా అప్పుడే పుట్టిన పిల్లల్ని రోడ్డు పక్కన పడేస్తున్న తల్లిదండ్రులు అనే వార్తలు వింటూనే ఉన్నాం.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే ఒకటి నెట్టింట అందరినీ కంట తడి పెట్టిస్తోంది.
దీన్ని చూసిన వారంతా ఇలా ఎలా చేస్తారంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం మనం చెప్పుకోబోయే విషయంలో ఏకంగా తన కన్న తల్లినే 15 ఏళ్ళ అమ్మాయి కరాటే బెల్టుతో ఉరేసి మరీ దారుణంగా గొంతు నులిమి చంపేసింది.
అయితే ఇక్కడ తన తల్లిని చంపడానికి ఆమెకు పెద్ద కారణం కూడా లేదు.ఎందుకంటే ఆ తల్లి తన కూతురిని మెడిసిన్ చదివించాలనుకుని ఎంతగానో కష్టపడుతోంది.కానీ చివరకు ఆ కూతురు చేతిలోనే తన ప్రాణాలు కోల్పోయింది.అయితే తల్లికి అలాగే కూతురుకు తరచూ చదువు విషయంలో నిత్యం గొడవలు వస్తుండేవని తెలుస్తోంది.
తన కూతురును డాక్టర్ చేయాలని చదివిస్తుంటే తాను మాత్రం ఇంట్రెస్ట్ చూపట్లేదని తల్లి వాపోయేదంట.
ఇక తన తల్లి మందలించినప్పుడల్ల కూతురు కూడా అదే విధంగా ఎదురు తిరిగేదని తెలుస్తోంది.ఇలా వీరిద్దరి గొడవలు చివరక పోలీస్ స్టేషన్ దాకా వెళ్లేవని తెలుస్తోంది.రీసెంట్‌గానే తన తల్లి తనను వేధిస్తోందంటూ ఆ కూతురు ఏకంగా పోలీసుల దాకా వెళ్లి మరీ కంప్లయింట్ చేసిందంట.
ఇక ఇంత జరిగినా కూడా వీరిద్దరి మధ్య మళ్ళీ గొడవలు రావడంతో ఆ టీనేజర్ ఈ సారి ఏకంగా తల్లి గొంతుకు కరాటే బెల్టు బిగించి మరీ దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది.ముందుగా తనకు తెలియనట్టు యాక్టింగ్ చేసినా చివరకు బయట పడింది.
దీంతో ఆమెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.