Krishna Dr. Guru N Reddy : కృష్ణ మృతి పై స్పందించిన కాంటినెంటల్ వైద్యులు.. ఏమన్నారంటే?

సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో నేడు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.మరణించడంతో ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున కృష్ణ నివాసానికి తరలివస్తూ ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

 What Did Continental Doctors Say About Krishnas Death, Continental Doctors , Abo-TeluguStop.com

ఇకపోతే కృష్ణ మరణించడంతో ఆయన మృతికి గల కారణాలను కాంటినెంటల్ వైద్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణకు వైద్యం అందించిన డాక్టర్లలో ఒకరైనటువంటి గురు ఎన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం రాత్రి మూడు గంటల సమయంలో కృష్ణ గారికి గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తీసుకు వచ్చారని తెలిపారు.అప్పటికే కృష్ణ గారు స్పృహ కోల్పోయి ఉండడంతో సుమారు 20 నిమిషాల పాటు కష్టపడి అతనికి సిపిఆర్ నిర్వహించి స్పృహలోకి తీసుకువచ్చామని గురు రెడ్డి వెల్లడించారు.

ఇలా ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినప్పటికీ గంట గంటకి ఆయన పరిస్థితి విషమంగా మారింది.

ఈయనకు పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం అతని మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని తెలియడంతో సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్ నిర్వహించామని తెలిపారు.

అయితే డయాలసిస్ చేసినప్పటికీ కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయనకు చికిత్స చేసిన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని అర్థమైంది.ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు వైద్యులు వెల్లడించారు.

నిమిష నిమిషానికి ఆయన ఆరోగ్యం విషమంగా మారిందని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.

Telugu Krishnas, Doctors, Dr Guru Reddy, Guru Reddy-Movie

ఇక కృష్ణ గారు మరణించే సమయంలో అతని బ్రెయిన్ కూడా కాస్త డామేజ్ అయిందని తెలిపారు.సాధారణంగా ఒక వ్యక్తి ఆఖరి క్షణాలలోకి వెళ్లిన తరువాత అతనికి చికిత్స అందించిన ప్రయోజనం లేదని తెలిస్తే ఆ క్షణాలు అతనికి చికిత్స అందిస్తూ ఇబ్బంది పెట్టమని వైద్యులు తెలిపారు.ఈ క్రమంలోనే కృష్ణ గారి విషయంలో కూడా చివరి క్షణాలలో అతనికి వైద్యం అందించి ఇబ్బంది పెట్టలేదని, ఇదే విషయాన్ని మహేష్ బాబు ఇతర కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశామని డాక్టర్ వెల్లడించారు.ఇక నేడు ఉదయం నాలుగు గంటల సమయంలో కృష్ణ గారు ఆఖరి శ్వాస వదిలినట్లు వైద్యులు ద్రవీకరించారని గురు ఎన్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube