టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల ఆదివారం తెల్లవారుజామున సమయంలో తుదిశ్వాస విడిచిన విషయం మనందరికీ తెలిసిందే.ఆయన మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలు విషాద ఛాయలు అమ్ముకున్నాయి.
ఇక కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.అభిమానులు కూడా కృష్ణంరాజు ఇక లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇకపోతే సోమవారం రోజున కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిసిన విషయం తెలిసిందే.అయితే కృష్ణంరాజు మరణ వార్త విన్న పలువురు ఆయన పార్తివదేహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున నివాసం వద్దకు చేరుకున్నారు.
ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.కాగా ఆయన పార్తివదేహాన్ని చూడటం కోసం వద్దకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అయిన వైసీపీ నేతలు, టిడిపి నేతలు, బిజెపి పార్టీ వాళ్లు అక్కడికి చేరుకొని ఆయన పార్తివదేహాన్ని సందర్శించారు.
ఈ క్రమంలోనే అక్కడికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు చేరుకొని ఆయన భౌతికకాయాన్ని సందర్శించి అనంతరం ప్రభాస్ ని ఓదార్చారు.ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతున్న చంద్రబాబు మళ్ళీ వెనక్కి వచ్చి ప్రభాస్ ను తీసుకొని కృష్ణంరాజు భార్యను పరామర్శించడం జరిగింది.

ఆ తర్వాత అక్కడే ప్రభాస్ దగ్గర కూర్చుని చాలాసేపు ముచ్చటించారు.ఈ క్రమంలోనే ప్రభాస్ భుజంపై చెయ్యి వేసి చంద్రబాబు మాట్లాడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఆ ఫోటోని చూసిన తర్వాత పలువురు అనేక రకాల అనుమానులను వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు నాయుడు ప్రభాస్ తో రాజకీయ ఎంట్రీ విషయం గురించి చర్చించి ఉంటారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా కృష్ణంరాజు చనిపోయే వరకు బిజెపి పార్టీలో ఉన్న విషయం తెలిసిందే.ఇంకా బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు చాలా దగ్గరగా ఉండడంతో కృష్ణంరాజు తర్వాత ఆ ఇంటి నుంచి ప్రభాస్ ను కానీ లేదంటే మరెవరినైనా రాజకీయాలలోకి వస్తే బాగుంటుంది అని అదే విషయం గురించి చంద్రబాబు చర్చించి ఉంటారు అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
మరి ఈ వార్తల్లో నిజా నిజాల సంగతి పక్కన పెడితే ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.