టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.ఇక ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయి సినిమాలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి సంతోషంగా గడపడానికి ఇష్టపడతారు.
వీలైనప్పుడల్లా తన భార్యతో విదేశీ ప్రయాణాలు చేస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా తన సోదరీమణులను బయటకు తీసుకు వెళుతూ వారితో కూడా ఎంజాయ్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే తాజాగా రాంచరణ్ తన అక్క సుస్మిత చెల్లెలు శ్రీజతో కలిసి బయటకు వెళ్లినట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.

తమ పిల్లలందరూ ఒకచోట ఉల్లాసంగా గడిపితే ఆ తల్లిదండ్రులకు కలిగే ఉత్సాహమే వేరు అంటూ తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక శ్రీజ గురించి కూడా అందరికీ సుపరిచితమే.ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ద్వారా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.







