టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.సికింద్రాబాద్ లో జ‌రిగిన ఘోర అగ్నిప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

 Revanth Reddy's Criticism Of The Trs Government-TeluguStop.com

ఈ క్ర‌మంలో ప్ర‌మాదానికి ప్ర‌భుత్వ నిర్లక్ష్య‌మే కార‌ణ‌మ‌ని ఆరోపించారు.గ‌తంలో హైద‌రాబాద్ లో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రిగాయ‌న్నారు.

ప్ర‌జ‌ల ప్రాణాలు బ‌లి అవుతున్న ప్ర‌భుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు.ఇలాంటి చ‌ర్య‌లు పున‌రావృతం కాకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లాంటి నగరంలో ప్రభుత్వం నియమ నిబంధనలు కఠినంగా అమ‌లు చేయకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయ‌ని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.ప్రభుత్వం వెంటనే ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయాలని కోరారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube