14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారు..?: మంత్రి కారుమూరి

టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైలుకు వెళ్లారని తెలిపారు.

 What Did Chandrababu Do To The People During His 14-year Rule?: Minister Karumur-TeluguStop.com

చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రజలు ఏం న్యాయం చేశారని మంత్రి కారుమూరి ప్రశ్నించారు.కానీ జగన్ నాలుగేళ్ల పాలనలో పార్టీలకు అతీతంగా ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు.

టీడీపీకి కార్యకర్తలు లేరన్న ఆయన రిలే నిరాహార దీక్షల్లో జనమే లేరని చెప్పారు.గొడవలు సృష్టించాలనే కొంతమంది పని చేస్తున్నారు కానీ వారికి కూడా చంద్రబాబు మీద ఎటువంటి సింపతీ లేదని పేర్కొన్నారు.

అటు పవన్ కల్యాణ్ నిర్వహించే వారాహి యాత్రకు సైతం జనాలు లేరని విమర్శించారు.పవన్ యాక్టర్ కాబట్టి టీడీపీ ఇచ్చే స్క్రిప్ట్ ను చదివేస్తున్నారని ఎద్దేవా చేశారు.

గతంలో టీడీపీ అవినీతిమయంగా ఉందన్న పవన్ ఇవాళ ప్టేట్ ఫిరాయించి విజనరీ ఉన్న పార్టీ అంటూ కొనియాడటాన్ని ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube