బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా మండిపడ్డారు.కరీంనగర్ కు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు.
ఎంపీగా గెలిచిన తరువాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని మంత్రి గంగుల ఆరోపించారు.కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే ఢిల్లీలో కూర్చుంటారన్న ఆయన కరీంనగర్ ను ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు.
ఒక్క కరీంనగర్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కొనసాగాలంటే కేవలం కేసీఆర్ ప్రభుత్వంతోనే సాధ్యమన్న మంత్రి గంగుల బీఆర్ఎస్ కు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరారు.







