పురుషాంగ శీర్షం దగ్గర ఉండే ఆ కురుపుల వలన ప్రమాదమా?

పురుషాంగం యొక్క శీర్షం మీద కొందరికి కాదు చాలామందికి చిన్నిపాటి కురుపులు లేదా మొటిమలు ఉంటాయి.

ఈ కురుపులు లేదా మొటిమలు ఎక్కువగా సున్తీ చేయించుకొని మగవారిలో కనిపిస్తాయి.

వీటిని చూసి పురుషులు బాగా ఆందోళన చెందుతారు.ఎందుకంటే ఇవి ఇన్ఫెక్షన్ సోకితే ఏర్పడే కురుపులలా కనిపిస్తాయి.

ఇవి అపరిశుభ్రత వలన కలిగి ఉంటాయేమో, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ సోకిందేమో, భాగస్వామి పోరపాటులో చర్మాన్ని కిందికి లాగితే ఏంటి పరిస్థితి అనుకుంటూ తమలో తాము మగవారు ఒరకమైన వేదన అనుభవిస్తూ ఉంటారు.మరి చాలామందిలో కనిపించే కురుపులు అసలు ఏమిటి? వీటివలన ఏమైనా ప్రమాదం ఉందా? ఇంతమంది పురుషులలో ఇవి ఉండటానికి కారణం ఏమిటి? ఇవి అపరిశుభ్రతకు సూచనా? ఇవి చాలామంది మగవారిలో సహజంగానే ఉంటాయి.ఇవి ఎలాంటి ఇన్ఫెక్షన్ వలన ఏర్పడ్డవి కాదు.

ఎలాంటి వ్యాధికి సూచన కాదు.క్యాన్సర్ కారకం అసలే కాదు.

Advertisement

అలాగే అపరిశుభ్రత వలన వచ్చినవి అంతకంటే కాదు.ఇవి పురుషాంగం శీర్షం దగ్గర ఎందుకు ఏర్పడతాయి అనే విషయం మీదా ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

సరైన కారణం మాత్రం బయటపడలేదు కాని వీటి వలన వచ్చే ప్రమాదం అయితే ఏమి లేదని స్పష్టంగా చెబుతున్నారు సైంటిస్ట్లు.ఇవి చూడటానికి మొటిమల లాగా, కురుపులు లేదా పోక్కులగా, 1-3 మిల్లిమీటర్ల సైజులో, తెలుపు, పసుపు లేదా గులాబి రంగులో ఉండటం, చూడ్డానికి అనారోగ్యంగా కనిపిస్తాయి అంతే.

ఇవి రాకుండా అడ్డుకోగలామా అంటే పెద్దగా మార్గాలు లేవు.అయితే సున్తీ చేసుకున్నవారిలో ఇవి ఎక్కువగా కనిపించవు.

కాకపొతే వీటిని చూసి బాధపడటం లేదా భయపడటం మీ వల్ల కావడం లేదు అంటే వీటిని తొలగించే మార్గాలు ఉన్నాయి.ఆ మార్గాల్లో ఒకటి ఫ్రీజింగ్, అంటే నైట్రోజన్ ని ఉపయోగించి వాటిని పోగోడతారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మరో మార్గం ఎలక్ట్రో సర్జరీ.ఈ సర్జరీలో కరెంట్ ఉపయోగించి ఆ కురుపులని పోగోడతారు.

Advertisement

ఇవి మాత్రమే కాకుండా రేడియో సర్జరీ, ఎక్సిసినల్ సర్జరీ, లేజర్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి.లాజికల్ గా వీటిని తొలగించుకోవాల్సిన అవసరం లేదు.

కాని మీరు ఇబ్బందిపడుతున్నా, మీ భాగస్వామి ఇబ్బందిపడుతున్నా, పైన చెప్పిన మార్గాల్లో ఒకటి ఎంచుకోవచ్చు.అంతేతప్ప, ఇవి మొటిమలు అనుకోని వాటి మీద మీకు ఇష్టం వచ్చిన మందులు ఉపయోగించి లేని ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు.

తాజా వార్తలు