జూన్ 7న లండన్ లోని ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్( WTC Final Match ) ఆస్ట్రేలియా- భారత్( Australia – India ) మధ్య మొదలైన సంగతి తెలిసిందే.టాస్ ఓడిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ కు దిగింది.
తొలి రోజే భారత బౌలర్లకు చుక్కలు చూపించారు ఆస్ట్రేలియా బ్యాటర్లు.తొలి రోజు కేవలం మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లైన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ లు చాలా అద్భుత ఆటలు ప్రదర్శించారు.ట్రావిస్ హెడ్ 146 నాటౌట్, స్టీవ్ స్మిత్ 95 నాటౌట్ గా నిలిచారు.
ఇక ఈరోజు అంటే రెండో రోజు ఈ బ్యాటర్లను త్వరగా పెవిలియన్ పంపించకపోతే ఇక భారత్ చేతిలోంచి మ్యాచ్ జారిపోయినట్టే.

అయితే తొలిరోజు మ్యాచ్ లో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ తో రోహిత్ శర్మ( Rohit Sharma ) నిర్ణయాలపై అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.అయితే రోహిత్ శర్మ తీసుకున్న ఆ నిర్ణయాలు ఏమిటో చూద్దాం.
ముందుగా భారత తుది జట్టు నుండి రవిచంద్రన్ అశ్విన్ ను తప్పించడమే.
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టెస్టుల్లో రాణిస్తున్న నెంబర్ వన్ బౌలర్.అటువంటి బౌలర్ ను పక్కన పెట్టడంతో భారీ మూల్యం చెల్లించుకుంటుంది భారత్.
రవీంద్ర జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఉంటే బాగుండేది అని కొందరు క్రికెట్ నిపుణుల అభిప్రాయం.

ఆ తర్వాత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంటే బాగుండేది.మ్యాచ్ ప్రారంభంలో ఆసిస్ కాస్త ఇబ్బంది పడి 73 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కూడా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 327 పరుగులు చేసింది.ఓవల్ పిచ్ బ్యాటింగ్ కు చాలా బాగా సహకరించింది.
ఇక చివరిగా ఫాస్ట్ బౌలర్లను ఏకంగా నలుగురిని తీసుకోవడమే.ఆసీస్ బ్యాటర్లు స్పిన్ కంటే ఫాస్ట్ బౌలింగ్ లోనే అద్భుతంగా ఆడగలరు.
అసిస్ పిచ్లు అన్ని ఫాస్ట్ బౌలింగ్ కు చాలా అనుకూలంగా ఉంటాయి.
తొలిరోజు జరిగిన ఆటను గమనిస్తే రవీంద్ర జడేజా బౌలింగ్ కాస్త పర్వాలేదు అనిపించింది.
ఇక మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ ల బౌలింగ్ కాస్త వేగంతో భయపెట్టినా .శార్దూల్ ఠాగూర్, ఉమేష్ యాదవ్ బౌలింగ్ లలో ఆసీస్ బ్యాటర్లు చెలరేగిపోయారు.