టీఎస్పీఎస్సీ( TSPSC ) వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ రేంజ్ లో విమర్శలు చేసి ఇబ్బంది పెట్టిన తెలంగాణా బిజేపి అద్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ఇప్పుడు పదవ తరగతి హింది పరీక్షా లీకేజ్ వ్యవహారంలో తానే ముద్దాయిగా నిలబడటం సంచలనం కలిగిస్తుంది.ఈ కేసులో కీలక నిందితుడు మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ ( Former journalist Prashant)వెనక ఉండి నడిపించినది బండి సంజయ్ అని కీలక ఆధారాలు లభ్యమయ్యాయని చెప్తున్న పోలీసులు బండి సంజయ్ను ఏకం గా ఏ వన్ గా పేర్కొంటూ రిమాండ్ రిపోర్టును ఫైల్ చేశారు .

బండి సంజయ్ అరెస్ట్ ,తదుపరి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్నారు ….ఈ విషయంపై బుధవారం రాత్రి సమయం లో కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందని వార్తలు వచ్చాయి .అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బిజెపిని కేసీఆర్ చీల్చి చెండాడుతారని చాలా ఊహగానాలు వచ్చాయి .అయితే ఆ తర్వాత అది క్యాన్సిల్ అయింది దీని వెనక కారణాలు ఏమిటి అని చాలామంది చర్చించుకున్నారు.
అయితే ఇంతకుముందు ఎమ్మెల్యేలు కొనుగోలు విషయంలో కానీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కానీ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేసిన కేసీఆర్ మరియు కేటీఆర్ ఆ ప్రెస్ మీట్ లో వివరించిన విషయాలు పట్ల తర్వాత కార్నర్ అయ్యారు.విచారణ సంస్థలు కి మాత్రమే తెలిసిన విషయాలు మీరు ప్రెస్మీట్లో వివరించడంతో అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది.
కేసీఆర్ ప్రభుత్వం విచారణ సంస్థలను ప్రభావితం చేస్తుందని ఉద్దేశపూర్వకంగా అది ప్రతిపక్షాలపై ఉసిగొలుపుతుందని ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి .ఈ అనుభవాలతోనే మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి దూకుడుగా ముందుకెళ్లడం వల్ల అనవసరమైన

ఇబ్బందులు వస్తాయని చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళేలా వ్యూహాత్మక మౌనం పాటించాలని సన్నిహితులు ఇచ్చిన సలహాలతో ఆఖరి నిమిషంలో ప్రెస్ మీట్ రద్దు చేసుకున్నారని తెలుస్తుంది.ఏది ఏమైనా టిఎస్పిఎస్సి ఆహారంతో సామాన్య జనంలో కూడా కొంత వ్యతిరేకతను కూడగట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి అద్దె వచ్చిన అవకాశంల ఈ పదవ తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారం దొరికిందని వ్యతిరేకతల మొత్తం భాజపాపైకి మళ్లించేలా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







