డెస్క్ టాప్ వాట్సప్ లో కొత్త ఫీచర్స్..!

ప్రముఖ ఇన్స్టంట్  మెసేజ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొని వస్తున్న సంగతి అందరికి విదితమే.

అలాగే  డెస్క్ టాప్ వర్షన్ లో   కూడా యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు ప్రవేశపెట్టడానికి సంస్థ ముమ్మరం చేస్తుంది.

తాజాగా వాట్సాప్ డెస్క్ టాప్ కస్టమర్ల కోసం సరికొత్త ఫ్యూచర్ లను ప్రవేశపెట్టింది.ఎన్నడూ లేని విధంగా వాట్సాప్ డెస్క్ టాప్ కోసం వాయిస్, వీడియో కాల్ ఫ్యూచర్ లో వాట్సాప్ సంస్థ అందుబాటులోకి ప్రవేశపెట్టింది.

అచ్చం మొబైల్ లో వాట్సాప్ లో ఎలాగైతే వాయిస్, వీడియో కాల్ స్ చేసే విదంగా డెస్క్ టాప్ వెర్షన్ లో కూడా సర్వీస్ లను అందచేసింది.ఇక ఈ ఫీచర్ ను మీ కంప్యూటర్ స్ర్కీన్ పై స్టాండెడ్ లోన్ విండోలో కూడా పోర్టరైట్, ల్యాండ్ స్కాప్ మోడ్ లో కూడా సులువుగా చేసుకోవచ్చు అని సంస్థ పేర్కొంది.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా చాలా వరకు ఆన్లైన్ వేదికగా కమ్యూనికేట్ అయ్యేందుకు చాలా సులువుగా ఉండే కోసం వాట్సాప్ డెస్క్ టాప్ కస్టమర్ల కోసం ఈ సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలియజేసింది.

Advertisement

ఇది ఇలా ఉండగా న్యూ ఇయర్ వేడుకల సమయంలో కూడా వాట్సాప్ సింగిల్ డే లోనే వాయిస్, వీడియో కాల్స్ రికార్డులు సృష్టించిన సంగతి విదితమే.అప్పటిలో 1.4 బిలియన్ యూసీ సర్వీస్ లో ఉన్నట్లు సంస్థ పేర్కొంది.ప్రస్తుతం ప్రవేశపెట్టిన వాయిస్ క వీడియో కాల్ లింక్ ఫ్యూచర్ మొదటిలో ఒకరి నుండి మరొకరికి మాత్రమే కాల్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది.

అతి త్వరలోనే గ్రూప్ కాల్స్ ఫ్యూచర్ ను కూడా ప్రవేశపెట్టేందుకు అందుకు తగ్గట్టు ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది వాట్సాప్.

Advertisement

తాజా వార్తలు