భారతీయ విద్యార్థులు చదువుకోవడానికి యూకే అత్యుత్తమ ప్రదేశమని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఎందుకంటే యునైటెడ్ కింగ్డమ్‌లో ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉన్న అనేక మంచి యూనివర్సిటీలో ఉన్నాయి.ఇంకా యూకేలో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఐదు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• మంచి పేరు:
ఇంగ్లాండ్‌లో చదువుకున్నారంటే ఆ చదువుకు ఎక్కడికి వెళ్లినా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.ఇక్కడ ఉన్న అనేక ప్రముఖ యూనివర్సిటీలు మంచి విద్యను అందిస్తాయి.ఇక్కడ నేర్చుకున్న విద్యకు తిరుగు ఉండదు.
• ఉద్యోగాలు:
యూకే యూనివర్సిటీలు విద్యార్థులకు ఉద్యోగ అనుభవాన్ని పొందడంలో సహాయపడతాయి మరియు UK విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్లు మంచి ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది.అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత పని కోసం 2 సంవత్సరాల వరకు UKలో ఉండగలరు.
• తక్కువ ధరలు:
యూకేలో చదువుకోవడం కొన్ని ఇతర దేశాల కంటే చౌకగా ఉంటుంది.విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
• మంచి విధానాలు:
యూకే, భారతదేశం ఒకరి డిగ్రీలను మరొకరు గుర్తించడానికి అంగీకరించాయి.ఈ పద్ధతి వల్ల విద్యార్థులకు అక్కడ చదువుకోవడం చాలా సులభం అవుతుంది.యూకేలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపార ఆలోచన ఉన్న గ్రాడ్యుయేట్‌లకు వీసా కూడా అందుబాటులో ఉంటుంది.
• నివసించడానికి చాలా సురక్షితమైన ప్రదేశం:
యూకే యూనివర్సిటీలు విద్యార్థులు స్థిరపడటానికి సహాయం చేస్తాయి.మద్దతు కోసం ఒకే నేపథ్యాల నుంచి వచ్చిన వారిని ఇతరులతో కనెక్ట్ చేస్తాయి.అలాగే ఇక్కడ అమెరికాలో లాగా గన్ కల్చర్ ఏమీ ఉండదు.