అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు... నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కె.కె రాజు

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వార్డు జై భారత్ నగర్ సచివాలయం 1086276 జై భారత్ నగర్ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కె.కె రాజు గారు 48వార్డు ఇంచార్జ్ నీలి రవి తో కలిసి పర్యటించారు.

 Welfare Schemes For Every Deserving One… Ned Cap Chairman Shri Kk Raju-TeluguStop.com

ఈ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ – ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.ఈ సందర్భంగా కె.కె రాజు గారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు, చివరి లబ్ధిదారుని వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ” వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమం చేపట్టారని అన్నారు.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలను నేరుగా ప్రజా ప్రతినిధులు తెలుసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని తద్వారా ఆయా సమస్యలను పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు,డైరెక్టర్లు ఆళ్ల శివగణేష్,కె.

పి రత్నాకర్,రాయుడు శ్రీను,48వార్డు నాయకులు కర్రి రామారెడ్డి,రుత్తల రాంబాబు,పి.పద్మా,పి.అప్పారావు,నరేష్,హేమంత్,జయ,భరత్,సీనియర్ నాయకులు షేఖ్ బాబ్జి,చిరంజీవి,వసంతల అప్పారావు,హరిపట్నాయక్, కె.చిన్నా,సునీల్,రాఘవులు,పావని,చందురెడ్డి,సచివాలయం సిబ్బంది,వాలంటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube