సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలకు కొంతమేర పేరు ప్రఖ్యాతలు వస్తేనే వారి వెంట ఎన్నో కంపెనీలు వారి బ్రాండ్లకు ప్రమోటర్ గా వ్యవహరించాలని హీరోల వెంట పడుతుంటారు.ఇప్పటికే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
నిజం చెప్పాలంటే సినిమాలకన్నా ఏడాదికి ఇలాంటి యాడ్స్ ద్వారానే భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే అగ్ర హీరోలుగా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి ఎంతోమంది హీరోలు ఇప్పటికే ఎన్నో రకాల బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ భారీగానే డబ్బు సంపాదిస్తున్నారు.
ఇక ఈ కోవలోకె నాచురల్ స్టార్ నాని కూడా వచ్చేశారు.నాని సైతం ఈ మధ్యకాలంలో పలు రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్ప్రైట్ సాఫ్ట్ డ్రింక్ కు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.
ఇప్పటికే ఈ యాడ్ టెలికాస్ట్ అవుతోంది ఇందులో నటి ఈషా రెబ్బ కూడా సందడి చేశారు.
ఇకపోతే నాచురల్ స్టార్ నాని చేసిన ఈ యాడ్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే టెలికాస్ట్ అవుతుంది.ఈ యాడ్ లో నాని చాలా సింపుల్ గా కనిపించారు.ఇకపోతే కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ప్రసారమయ్యే ఈ యాడ్ కోసం నాని తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ యాడ్ కోసం నాని ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.
ఇలా ఈయన రెండు కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఏది ఏమైనా నాని సైతం ఇలా యాడ్స్ ద్వారా భారీగానే డబ్బు సంపాదిస్తున్నారు.
ప్రస్తుతం నాని దసరా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.






