సంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత పట్నం మాణిక్యం సంగారెడ్డి అసెంబ్లీ సీటు ఆశించి భంగపడిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా పట్నం మాణిక్యం గత కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.ఈ క్రమంలో విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు.
పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని బుజ్జగించారు.అనంతరం మాణిక్యాన్ని తనతో పాటు హైదరాబాద్ కు తీసుకెళ్లారు.
అయితే పట్నం మాణిక్యంకు భవిష్యత్ లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు.







