అర్హులైన ప్రతి పేదవాడికి పింఛన్ల ఇస్తాం..మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ హయాంలో ఉచిత కరెంట్ కాదు.ఉత్త కరెంట్ ఉచితాలు వద్దు అనే బిజెపికి బుద్ది చెప్పాలి.

కేసీఆర్ ది గజ్వేల్ నియోజక వర్గం కావడం మీ అదృష్టం పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం మాది మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు.

కొత్తగా ఆసరా పింఛన్లు అందుకుంటున్న 584 మందికి శుభాకాంక్షలు.ఇకనుంచి మీకు నెల నెల రూ.2016 అందుతాయి.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు పింఛన్ రు.75 ఉండే.ఎవరైనా చనిపోతేనే తప్ప వారి స్థానంలో నాడు కొత్తవి ఇచ్చేవి కావు.

ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 చేసింది.కానీ ఒంటరి మహిళలకు, చేనేత, గౌడ పింఛన్లు ఇవ్వలేదు.కానీ మేము మాత్రం ఏకంగా 10 ఇంతలు పెంచి, రు.2016 చేసాము.పింఛన్ల డబ్బు పెరిగింది పింఛన్ల సంఖ్య పెరిగింది.

Advertisement

ఇది మా ప్రభుత్వంలో జరిగిన మార్పు.అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తాం.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కన్న కొడుకు చీర కొని ఇవ్వకపోయినా పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీర ఇస్తున్నరు.

బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నరు మాకు కులం లేదు మతం లేదు.పేదలందరికీ భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం.

తూప్రాన్ గజ్వేల్ మెదక్లో మంచి ఆసుపత్రులు వచ్చాయి.కరోనా వల్ల కొంత ఇబ్బంది ఉండే.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అయినా పేదలను కడుపులో పెట్టుకొని చూస్కున్నాడు.పది కిలోల బియ్యం ఇచ్చాడు.

Advertisement

సమయానికి పింఛన్లు ఇచ్చారు.ఢిల్లీలో కూర్చున్న వారు కాళేశ్వరం మీద విమర్శలు చేస్తరు.

భూమికి బరువయ్యే పంట పండుతుంది.కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి ఇది సాధ్యం అయ్యింది కొంత మంది ఉచితాలు వద్దు అంటారుకాంగ్రెస్ జమానాలో ఉచిత కరెంట్ కాదు ఉత్త కరెంట్.రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం మనోహరబాద్ మండల కేంద్రం లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు రెండు కోట్లు వ్యయంతో నిర్మించనున్న పిహెచ్సి భవనానికి శంకుస్థాపన చేశారు .50 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతోపాటు 15 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు.20 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు.అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 584 మంది నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ అధ్యక్షులు ఒంటేరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్లు ప్రతిమసింగ్,రమేష్, రాష్ట్ర సర్పంచ్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు