జూన్ ఒకటి లోగా ధాన్యం కొనుగోళ్ళు పూర్తి చేస్తాం: అదనపు కలెక్టర్ పి.బెన్షాలోమ్

యాదాద్రి భువనగిరి జిల్లా: యాసంగి ధాన్యం జూన్ ఒకటవ తేదీలోగా కొనుగోళ్లను పూర్తి చేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి.బెన్షాలోమ్ తెలిపారు.

 We Will Complete Grain Purchases By June 1 Additional Collector P Benshalom, Gr-TeluguStop.com

బుధవారం జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లపై ఆయన మాట్లాడుతూ… జిల్లాలో 323 ధాన్యం కొనుగోళ్ల ఏర్పాటు ద్వారా ఇప్పటి వరకు 2 లక్షల 82 వేల 330 మెటిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని,77 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి మూసి వేయడం జరిగిందని,మిగతా 246 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 320 లారీలు మిల్లులకు ధాన్యం తరలిస్తున్నామన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా హన్మకొండ జిల్లాకు పది వేల మెట్రిక్ టన్నులు, జనగాం జిల్లాకు 40 వేల మెట్రిక్ టన్నులు,రంగారెడ్డి జిల్లాకు పది వేల మెట్రిక్ టన్నులు,నల్లగొండ జిల్లాకు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అక్కడి మిల్లులకు పంపిస్తున్నట్లు తెలిపారు.

ధాన్యం కొనుగోలు పూర్తయిన కేంద్రాల్లోని హమాలీలను ఇతర కేంద్రాలకు పంపించి ధాన్యం త్వరగా మిల్లులకు తరలిస్తున్నట్లు చెప్పారు.జిల్లా సహకార, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల అధ్వర్యంలో మండల స్పెషల్ ఆఫీసర్ల టీముల పర్యవేక్షణలో కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయన్నారు.

వ్యవసాయ అధికారులు ధాన్యం నాణ్యతలను పరీక్షించి గ్రేడింగ్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని,నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని,అదే విధంగా రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకొచ్చేలా అవగాహన కలిగించాలని తెలిపారు.400 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించామని,కొనుగోలు కేంద్రాలలో 4 వేల టార్పాలిన్స్ అందుబాటులో వున్నాయని,మరో వెయ్యి టార్పాలిన్స్ పంపిస్తామని, గన్నీ బ్యాగుల కొరత లేదని,మిల్లర్లతో తరచూ సమవేశమై అన్లోడింగ్ సమస్యలు రావద్దని,ట్రక్ట్స్ త్వరగా పంపాలని, అవసరమైతే ప్రైవేట్ గోదాముల్లో స్టోరేజీ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించడం జరిగిందని, జిల్లాలో ఇంకా 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లిఫ్ట్ చేయాల్సి ఉందని, జూన్ ఒకటవ తేదీలోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube