CM Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం..: సీఎం రేవంత్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.ఇంద్రవెల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికపై నుంచి లోక్ సభ ఎన్నికల( Loksabha Elections ) శంఖారావాన్ని పూరించారు.

 We Will Adopt Adilabad District Cm Revanth Reddy-TeluguStop.com

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పదేళ్ల పాలనలో ఏనాడైనా కేసీఆర్( KCR ) అడవి బిడ్డల సంక్షేమం గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు.

ఇంద్రవెల్లి గడ్డ నుంచే ఇందిరమ్మ రాజ్యస్థాపనకు శ్రీకారం చుట్టామన్న రేవంత్ రెడ్డి ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని తెలిపారు.

సీమాంధ్ర పాలనలో ఆదివాసీలకు అన్యాయం జరిగినందుకు అప్పుడే క్షమాపణ చెప్పానన్నారు.తెలంగాణ ఆర్థిక సంపదను కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుందని ఆరోపించారు.తెలంగాణలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారన్న ఆయన మిషన్ భగీరథ( Mission Bhageeratha ) పేరు మీద దోచుకున్నారని మండిపడ్డారు.కేసీఆర్ ఏనాడైనా అడవిబిడ్డల కోసం సమీక్ష చేశారా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube