ఏపీలో కళాకారులకు అండగా ఉంటాం..: పోసాని

ఏపీలో ఉన్న కళాకారులు అందరికీ ఐడీ కార్డులు ఇస్తామని వైసీపీ నేత, ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ అన్నారు.

ఈ మేరకు ఆర్టిస్టులతో పాటు టెక్నిషియన్లకు కూడా గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు.

ఏపీలో ఉన్న కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న పోసాని ఏజెంట్ల చేతిలో కళాకారులు మోసపోకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.జూనియర్ ఆర్టిస్టులు ఎంతో కష్టపడుతున్నా వారి డబ్బు సగం ఏజెంట్లే తింటారన్నారు.

ఈ క్రమంలో ఏజెంట్ల మధ్యవర్తిత్వం వద్దన్న పోసాని ఇకపై డైరెక్టర్ ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తే కళాకారుల వివరాలన్నీ వస్తాయని చెప్పారు.అలాగే వారికి ఎటువంటి రాయితీలు ఇవ్వాలనేది ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు