ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం: కేటీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా: నల్లగొండ,ఖమ్మం,వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఆదివారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు.

భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నిసార్లు గులాబీ పార్టీ గెలుస్తూ వస్తున్నదని,ఈ సారి కూడా విజయం మనదేనని అన్నారు.మన అభ్యర్ధి రాకేష్ రెడ్డి స్వయంకృషితో పైకి వచ్చాడని, హైలి ఎడ్యుకేటెడ్,ప్రశ్నించే గొంతుక,ధిక్కార స్వరం రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

మన అభ్యర్ధి రాకేష్ రెడ్డి విద్యావంతుడు అయితే అటు వైపు ఉన్న ప్రత్యర్థి పచ్చి బ్లాక్ మైలర్,సొల్లు కబుర్లు చెప్పే మోసగాడని,పట్టభద్రులు ఎవరికీ ఓటు వేయాలో ఆలోచుకొని ఓటేస్తారని అన్నారు.మోడీ అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్నడని,విభజనహామీలను తుంగలో తొక్కారని,యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని, బీజేపీ వాళ్ళు గుడి కట్టి ఓట్లు అడుగుతున్నారని,మరి మనం కూడా యాదాద్రి ఆలయం కట్టామని,కాళేశ్వరం లాంటి ఆధునిక ఆలయాన్ని కూడా కట్టామని,కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు.

ఉమ్మడి నల్గొండలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని,యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించామని,కానీ, చేసిన పని సరిగా చెప్పుకోలేక ఓటమి పాలయ్యామని తెలిపారు.మన పాలనలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసామని,అయినా స్వల్ప తేడాతో ఓటమి చెందామని వాపోయారు.రుణమాఫీ పై కాంగ్రెస్ పూటకో మాట మారుస్తుందని,మనం ప్రశ్నించాలని,ఇవాళ తెలంగాణ ఆగమైందని,420 హామీలను ఇచ్చి అన్నింటిని కాంగ్రెస్ మర్చిపోయిందని విమర్శించారు.30 వెల ఉద్యోగాలను కేసీఆర్ భర్తీ చేస్తే వాటి జాయినింగ్ లేటర్లు పంచుతూ రేవంత్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకోవడం సిగ్గు చేటన్నారు.పచ్చి అబద్ధాలు చెప్పే రేవంత్ రెడ్డి పార్టీకి, బీజేపీకి ఓటేయకుండా,ఓటర్లు ఆలోచన చేసి ఉన్నత విద్యావంతుడైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Advertisement

ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఎమ్మెల్యేలు,పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదిలోనే వాడిపోతున్న విద్యా కుసుమాలు...!
Advertisement

Latest Yadadri Bhuvanagiri News