కాపుల రిజర్వేషన్ అంశం భావోద్వేగాలతో కూడుకున్న సున్నితమైందని, రాజకీయంగా పరిష్కారం కావల్సిన విషయంగా గుర్తించాలని సూచించారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఆదివారం తనని కలసిన మీడియా మిత్రులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ రిపోర్ట్ ద్వారా బిసి జాబితాలో కాపుల్ని చేరుస్తూ ప్రకటించినంత మాత్రాన ఆ రిజర్వేషన్లు అమలు కావన్నది కాపు నాయకులకు తెలుసని, అయినా దీనిని రాజకీయ కోణంలో పరిష్కారానికి మార్గాలు వెతకాలని చెప్పారు.కేం్రదానికి రాష్ట్ర ప్రభుత్వం పంపే నివేదికపై పార్లమెంట్‌లో చర్చించి, రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మాత్రమే కాపులకు రిజర్వేషన్ ఫలాలు దొరకుతాయి మినహా తక్షణ అమలు సాధ్యం కాదని స్పష్టం చేసారు.
ఈ సాంకేతిక అంశాలను కాపుజాతికి తెలియజేయ చేయాల్సిన ముద్రగడ పంతాలకు, పట్టింపులకు వెళ్ళడం వల్ల కాపులకు న్యాయం కంటే అన్యాయమే జరుగుతుందని, వ్యాఖ్యానించారు.
కాపుల రిజర్వేషన్ల విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినకమీషన్ ఆగస్టు వరకు గడువు ఉన్నందున అప్పటివరకు ఇరువర్గాలు ఎలాంటి ప్రకటనలు చేయరాదన్నారు.
ప్రస్తుత స్థితిలో ఉద్యమకారులను చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడటం, అరెస్టులంటూ దుందుడుకు చర్యలకు దిగడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగడం తప్ప సాధించే ప్రయోజనాలు శూన్యమన్నారు
కమిషన్ కాపులను బిసిలుగా గుర్తించాలని కోరిన వెంటనే కాపులు తరఫున తమిళనాడు తరహలో రాజ్యాంగ సవరణ అవసరం ఉన్నందున ఈ అంశం ప్రాధాన్యతను ప్రధానికి వివరించి రాష్ట్రంలోని అన్ని పార్టీల మద్ధతుతో సవరణ తెచ్చే ప్రయత్నం చేసి సాధిద్దామన్నారు.
అన్ని వర్గాల్లో సానుభూతి పొంది అందరి మద్ధతుతో రిజర్వేషన్లు సాకారం చేసుకోవాల్సిన తరుణంలో పద్మనాభం దీక్ష కు దిగటం సరికాదని తక్షణమే ప్రక్రియకు స్వస్తి చెప్పి, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూడాలని అన్నారు.
అలాగే ముద్రగడను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచినందున అక్కడి రోగులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆయనను మరో చోటికి తరలించడం మంచిదని అన్నారు.
కానీ పంతాలకు పోయి, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తే యావత్ జాతి నష్టపోవటమే కాదు ఎన్నో దశాబ్ధాలుగా ఎ దురుచూస్తున్న రిజర్వేషన్లు రాకుండా పోయే ప్రమాదం ఉందని కాపు నేతలు సైతం గుర్తించాలని, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం కాలయాపన చేయకూడదని, కాపుల రిజర్వేషన్ విషయంలో శాంతియుత వాతావరణాన్ని కల్పించి, చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశంలో పాలు పంచుకునేందుకు మరికొందరితో కలిసి చర్చలకు ప్రభుత్వం అంగీకరిస్తే తాను కదిలి వస్తానన్నారు
.






