కాపు రిజర్వేషన్‌పై దీక్ష చేస్తున్న కాపునేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యపరిస్థితి క్రమేణా క్షీణిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.ఆ మేరకు ఆదివారం పై రాజమహేంద్రవరం ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రమేష్ కిశోర్ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.
ముద్రగడ నీరసంగా ఉన్నారని, తామెంత ప్రయత్నిస్తున్నా, ఆయన వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారనివెల్లడించారు.కనీసం నీళ్లను సైతం తాగటంలేదని, వైద్య పరీక్షలకు సహరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ముద్రగడ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకర స్థితికి చేరుకుంటోందని బంధువర్గంలో ఆందోళన మొదలైంది.
కాగా అసలు సీబిఐపై నమ్మకం లేక దానిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే జగన్, లాగే కాంగ్రెస్ నేత చిరంజీవితో సహా ఆ పార్టీ నేతలు గత కొంత కాలంగా తుని ఘటనపై సిబిఐ దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ చేసిన ముద్రగడ హఠాత్తుగా సిబిఐ దర్యాప్తు అవసరం లేదంటూ వెల్లడించడం పట్ల అటు కాంగ్రెస్, ఇటు వైకాపాలు ఖంగు తిన్నట్లే కనిపిస్తోంది.
దీంతో సిబిఐని రంగంలోకి దించేందుకు సిద్ధమేనంటూనే ముందు ముద్రగడ అంగీకరించాలన్న చంద్రబాబు వ్యూహాత్మకంగా విధించిన షరతు ఉచ్చు బాగానే బిగిసినట్లుందన్నది విశ్లేషకుల భావన.
మరో వైపు జిల్లా వ్యాప్తంగా ముద్రగడ అనుచరులు పాదయాత్రలు, నిరసనలతో హోరెత్తిస్తుండటంతో భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు అధికారులు
.






