గ్లిజ‌రిన్‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌కండి.. ఇలా వాడితే ముఖం మెరిసిపోతుంది!

గ్లిజ‌రిన్‌.దీని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

కూర‌గాయ‌ల కొవ్వు మ‌రియు నూనె నుండి గ్లిజ‌రిన్‌ను త‌యారు చేస్తారు.

రంగుగానీ, వాస‌న‌గానీ లేని నాన్ టాక్సిక్ లిక్విడ్ ఇది.అయితే దీనిని చాలా మంది పెద్ద‌గా ప‌ట్టించుకోరు.అయితే, గ్లిజ‌రిన్‌ను ఏ మాత్రం త‌క్కువ అంచ‌నా వేయ‌కండి.

ఎందుకంటే, ఇది ఆరోగ్య ప‌రంగానే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఎన్నో విధాలుగా స‌హాయ‌ప‌డుతుంది.ముఖ్యంగా గ్లిజ‌రిన్‌ను ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా వాడితే మ‌చ్చ‌ల్లేని మెరిసే ముఖం మీసొంతం అవుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం చ‌ర్మానికి గ్లిజ‌రిన్‌ను ఎలా వాడాలో చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, వ‌న్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, చిటికెడు ప‌సుపు, రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ప‌చ్చి పాలు వేసుకుని అన్నీక‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.ప‌ది నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆపై వేళ్ల‌తో సున్నితంగా రుద్దుకుంటూ వాట‌ర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేస్తే మ‌లినాలు, మృత కణాలు తొల‌గిపోయి ముఖం గ్లోయింగ్‌గా మెరుస్తుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, వ‌న్ టేబుల్ స్పూన్ పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడ‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.

ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.పూర్తిగా ఆరిన త‌ర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖ చ‌ర్మం మృదువుగా, కోమ‌లంగా మారుతుంది.

Advertisement

ఇక ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ గ్లిజ‌రిన్‌, వ‌న్ టేబుల్ స్పూన్ చంద‌నం పొడి, పావు స్పూన్ ప‌సుపు వేసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.ప‌దిహేను నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆపై ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేస్తే మ‌చ్చ‌లు, మొటిమ‌లు తొల‌గిపోయి ముఖం అందంగా, ప్ర‌కాశవంతంగా మారుతుంది.

తాజా వార్తలు