ఆ విషయంలో ఎప్పటికీ బాలకృష్ణ నంబర్ వన్ హీరో.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ భోళా మనిషి అని చాలామంది చెబుతారు.స్క్రిప్ట్ ను నమ్మి నటించే టాలీవుడ్ హీరోలలో బాలయ్య ఒకరు కావడం గమనార్హం.

 Star Hero Balakrishna Number One Hero In That Matter Details Here , Balakrishna,-TeluguStop.com

సినిమాసినిమాకు బాలయ్య రేంజ్, మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.అయితే ఒక విషయంలో మాత్రం బాలయ్య నంబర్ వన్ హీరో అని అనిపించుకుంటున్నారు.

ఒకసారి కథ విని ఓకే చేస్తే బాలయ్య ఆ స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకోరు.

కొన్నిసార్లు సినిమా అంచనాలను అందుకోకపోవచ్చనే అనుమానం వచ్చినా బాలయ్య మాత్రం దర్శకులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు.

ఈ విషయంలో మాత్రం బాలయ్యే నంబర్ వన్ హీరో కావడం గమనార్హం.బాలయ్య తర్వాత ఈ జాబితాలో మహేష్ బాబు ఉన్నారు.కథ వినే సమయంలోనే ఏవైనా సందేహాలు ఉంటే ఆ సమయంలోనే ఆ సందేహాలను వ్యక్తం చేసి కథలో మార్పులు జరిగేలా మహేష్ బాబు జాగ్రత్తలు తీసుకుంటారు.

స్క్రిప్ట్ ను లాక్ చేసిన తర్వాత మాత్రం కథ విషయంలో జోక్యం చేసుకోవడానికి మహేష్ బాబు అస్సలు ఇష్టపడరు.

మరి కొందరు స్టార్ హీరోలు మాత్రం ఒక సినిమా సక్సెస్ సాధిస్తే తర్వాత సినిమాల స్క్రిప్ట్ ల విషయంలో జోక్యం చేసుకుంటూ ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యేలా చేసుకుంటున్నారు.దర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే సినిమాలు దర్శకుల విజన్ కు అనుగుణంగా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.

Telugu Balakrihsna, Number, Prashanth Neel, Rajamouli-Movie

స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి కొంతమంది డైరెక్టర్ల దగ్గర మాత్రం ఏ స్టార్ హీరో కథలో వేలు పెట్టడానికి ఇష్టపడరు.ఈ స్టార్ డైరెక్టర్లకు సైతం తమ పనిలో ఇతరులు జోక్యం చేసుకుంటే నచ్చదనే సంగతి తెలిసిందే.బాలకృష్ణ, మహేష్ బాబు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube