పుచ్చ సాగుకు( watermelon ) అన్ని కాలాలు అనుకూలంగానే ఉంటాయి కానీ వేసవికాలంలో సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.పుచ్చ సాగులో అధిక దిగుబడి సాధించాలంటే పొడి వాతావరణం అవసరం.
పుచ్చ సాగుకు నల్ల రేగడి నేలలు, సారవంతమైన ఇసుక నేలలు, నీరు ఇంకిపోయే ఎర్ర నేలలు చాలా అనుకూలం.ముందుగా నేలలో రెండు లేదా మూడుసార్లు లోతు దుక్కులు దున్నుకొని చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సూపర్ సింగల్ ఫాస్ఫేట్, 25 కిలోల యూరియా, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి.

బోదెల పద్ధతిలో( Bodela style ) కానీ, ఎత్తు బెడ్ల పద్ధతిలో కానీ విత్తనం విచ్చేటప్పుడు జిగ్ జాక్ పద్ధతి అనుసరించి ఎత్తు బెడ్లకు రెండు వైపులా లేదా బోదెల రెండువైపులా మొక్కల మధ్య 70 సెంటీమీటర్ల దూరం, సాలుల మధ్య 125 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తనాన్ని విత్తుకోవాలి.విత్తిన 25 రోజుల తర్వాత ఒక ఎకరాకు 30 కిలోల యూరియా వేసుకోవాలి.మొక్కల వయసు 55 రోజులు వచ్చిన తర్వాత ఎకరాకు 15 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసుకోవాలి.మొక్కకు మూడు లేదా నాలుగు ఆకులు ఉన్న సమయంలో ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారి చేయాలి.

ఇక ఈ పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే పండు ఈగలు కీలక పాత్ర పోషిస్తాయి.ఈగలను ఈ పండు ఈగలు పంట పొలంలో కనిపిస్తే వెంటనే 10 లీటర్ల నీటిలో 100 మీ.లీ మలాథియాన్( Malathion ), 100గ్రాముల బెల్లం కలిపి ఒక వెడల్పాటి పళ్లెంలో ఈ ద్రవాన్ని పోసి పంట చేనులో అక్కడక్కడ ఎరలుగా ఉంచాలి.అలాగే ఒక లీటరు నీటిలో రెండు మిల్లీలీటర్ల మలాథియాన్ ను కలిగి పిచికారి చేయాలి.
ఈ పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో తామర పురుగులు కూడా ఉన్నాయి.ఈ తామర పురుగుల నివారణకు ఒక లీటర్ నీటిలో రెండు మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ కలిపి పిచికారి చేయాలి.







