ఇక్కడ ఒక సినిమా హిట్ అయితే చాలు చాలా మంది పైకి కంగ్రాట్స్ చెప్పిన కూడా లోపల మాత్రం చాలా కుళ్ళుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఒక హిట్ పడితే హీరో గాని, డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ కానీ ఎక్కడ మనల్ని దాటేసి ముందుకు వెళ్ళిపోతారో అని ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది.అయితే ఒక సినిమా ప్లాప్ అయితే మాత్రం అందరు ఆ సినిమా మంచి సినిమా ఎందుకు ప్లాప్ అయిందో పాపం అంటూ ముసలి కన్నీరు కార్చినట్టు గా నటిస్తూ ఉంటారు.
అయితే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ని( Chiranjeevi ) చూసి అందరు ఇలానే అనే వారు అని నాగ బాబు( Nagababu ) ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు మెగాస్టార్ కి ఒక హిట్ వస్తే చాలు కుళ్ళుకునే వాళ్ళు ఇండస్ట్రీ లో చాలా మందే ఉన్నారు.

ఆయన సినిమా మీద నెగిటివ్ గా మాట్లాడి( Negative Comments ) కలక్షన్స్ ని తగ్గిద్దాం అని చూసే వాళ్ళుకూడా చాలా మందే ఉన్నారు అంటూ ఆయన అప్పట్లో చాలా కామెంట్లు చేసారు…అయితే అప్పట్లో వీళ్ళందరికీ కి షాక్ ఇచ్చేలా చిరంజీవి వరుసగా ఐదు సంవత్సరాలు ఐదు ఇండస్ట్రీ హిట్లు కొట్టి అప్పుడు తన తో పాటు పోటీ లో ఉన్న అందరి హీరోలకి అందని అదనంత ఎత్తులో చిరంజీవి ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

చిరంజీవి లాంటి ఒక గొప్ప వ్యక్తి సినిమాల మీద కూడా అప్పట్లో చాలా నెగిటివ్ కామెంట్లు స్ప్రెడ్ చేస్తూ సినిమాకి చాలా ఇబ్బందులు పెట్టిన వారు ఉన్నారు వాళ్లందరికీ తన సినిమాతో సమాదానాలు చెప్తూ వచ్చాడు చిరంజీవి ఎవరిని కూడా ఒక్క మాట అనకుండా తన సినిమాలతోనే అందరికి సమాదానాలు ఇస్తూ వచ్చాడు.అందుకే ఆయన మెగాస్టార్( Megastar ) అయ్యాడు.చిరంజీవి అంటే అప్పట్లో ఒక పెను సంచలనం అనే చెప్పాలి ఆయన చేసిన ప్రతి సినిమా చూడటం కోసం సగటు అభిమాని తీవ్రంగా వెయిట్ చేసేవాడు…
.







