ఇదెక్కడి చోద్యం.. చెట్టు నుంచి పెద్ద ఎత్తున పారుతున్న నీరు.. వీడియో వైరల్!

మాంటెనీగ్రో దేశంలోని డైనోసా అనే ఒక గ్రామంలో ఉన్న ఓ చెట్టు నుంచి నీళ్లు భారీ ఎత్తున బయటికి వస్తున్నాయి.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.ఇదెలా సాధ్యమని నోరెళ్లబెడుతున్నారు.

అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు డైనోసా గ్రామానికి జనాలు పోటెత్తుతున్నారు.ఇంతకీ చెట్టు నుంచి నీళ్లు రావడం ఏంటి? దీని వెనుక దాగి ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.మల్బరీ జాతికి చెందిన ఒక 150 ఏళ్ల చెట్టు 20 సంవత్సరాల నుంచి తన చెట్టుబోదె లేదా మొండెం నుంచి నీటిని విడుదల చేస్తోంది.

ఈ దృశ్యం స్థానికులను ఆశ్చర్యచకితులను చేస్తోంది.దీని విశేషాల గురించి ఆ నోటా ఈ నోటా పడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వేలాది మంది సందర్శకులు వస్తున్నారు.

Advertisement

ఈ అద్భుతమైన దృశ్యం కేవలం శీతాకాలం చివరిలో లేదా వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తుంది.భూమి నుంచి దాదాపు 1.5 మీటర్ల ఎత్తులో ఉండే చెట్టు మధ్య భాగం నుంచి మీరు రావడం మీరు వీడియోలో గమనించవచ్చు.

అయితే ఈ చెట్టు నుంచి ఒక్కసారి నీళ్ళు రావడం ప్రారంభిస్తే, ఆ నీరు రెండు రోజులు పాటు కంటిన్యూగా ప్రవహిస్తూనే ఉంటుందట.దీనికి కారణం దీనికింద ఒక నీటి వనరు ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు.అలాగే చెట్టు మధ్యలో ఒక తొర్ర ఏర్పడడంతో నీరు పైకి ఎగదన్నుకుని వస్తోంది.

ఇందుకు కారణం నీటిలో ఏర్పడే పీడనం అని భౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఏదిఏమైనా ఈ ప్రకృతి దృశ్యం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.

ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!
Advertisement

తాజా వార్తలు