వ్యవసాయంలో శిలీంద్రపు తెగుళ్ల నుంచి పంటను సంరక్షించుకోవాలంటే వేస్ట్ డీకంపోజర్ వాడాలి.ఈ వేస్ట్ డీకంపోజర్( Waste Decomposer ) భూసారాన్ని పెంచడంతోపాటు, పంట సాగు ఖర్చు కూడా తగ్గిస్తుంది.
ఆవు పేడ( Cow Dung ) నుంచి సేకరించిన మూడు రకాల బ్యాక్టీరియా ల ద్వారా ఈ వేస్ట్ డీకంపోజర్ తయారు చేసుకోవచ్చు.కేవలం 20 రూపాయల ఖర్చుతో రైతులు స్వయంగా ఈ వేస్ట్ డీకంపోజర్ ను అభివృద్ధి చేసుకొని ఏళ్ల తరబడి పంటలకు వాడుకోవచ్చు.
ఈ వేస్ట్ డీకంపోజర్ ను ఎలా తయారు చేసుకోవాలి? ఎలా ఉపయోగించాలి అనే విషయాలను తెలుసుకుందాం.
పంటలకే కాక, సేంద్రియ వ్యవసాయ వ్యర్థాలను త్వరగా కుల్లబెట్టేందుకు ఈ వేస్ట్ డీకంపోజర్ ఉపయోగపడుతుంది.
సాధారణంగా వర్మి కంపోస్ట్( Vermi Compost ) తయారు చేయడానికి మాగిన పశువుల ఎరువును, కుళ్ళిన చెత్తను ఉపయోగిస్తాం.ఇలా కుళ్ళడానికి కనీసం 6 నెలల సమయం పడుతుంది.
కానీ వేస్ట్ డీకంపోజర్ వల్ల ఎరువు త్వరగా కుళ్ళుతుంది.
ఒకసారి తయారైన వేస్ట్ డీకంపోజర్ ను రైతులు మళ్లీమళ్లీ అభివృద్ధి చేసుకోవచ్చు.ఐదు లీటర్ల వేస్ట్ డీకంపోజర్ ను 200 లీటర్ల నీటిలో కలిపి అందులో రెండు కిలోల బెల్లపు మడ్డిని వేసి, రోజూ ఉదయం సాయంత్రం కలియతిప్పితే ఐదు నుంచి ఆరు రోజులలోపు వేస్ట్ డీకంపోజర్ ద్రావణం తయారవుతుంది.ఈ ద్రావణం పుల్లటి వాసన కలిగి ఉంటుంది.
పంట అవసరాలకు అనుగుణంగా డ్రమ్ములు లేదంటే సిమెంట్ ట్యాంకులలో వేల లీటర్ల ద్రావణాన్ని తయారు చేసుకొని పంటకు అందించాలి.ఈ ద్రావణాన్ని నేలకు అందించడం వల్ల నేలలో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది.నేలలో ఉండే శిలీంద్రపు తెగుళ్లు, నులిపురుగుల అవశేషాలు పూర్తిగా నాశనం అవుతాయి.దీంతో రసాయన ఎరువుల ఖర్చు దాదాపుగా తగ్గుతుంది.పైగా నాణ్యమైన అధిక దిగుబడి సాధించవచ్చు.