ఖమ్మం రాజకీయాల్లో ప్రస్తుతం వనమా రాఘవేంద్ర హాట్ టాపిక్ గా మారారు.ఆయన వల్ల రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్య చేసుకుందని అందరూ అంటున్నారు.
ఆత్మహత్య చేసుకునే ముందు రామకృష్ణ కూడా తన చావుకు కారణం వనమా రాఘవేంద్రే అని చెప్పడం గమనార్హం.దీంతో వనమా రాఘవేంద్రపై నిఘా ఎక్కువైంది.
ఆయన ప్రస్తుతానికి పరారీలో ఉన్నా కూడా ఎలాగైనా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కొడుకే వనమా రాఘవేంద్ర.
ఈ రాఘవేంద్రకు రౌడీయిజం చాలా అలవాటని అక్కడి వారు చెబుతున్నారు.చిన్న చిన్న సెటిల్మెంట్లు, భూదందాలు, రియల్ ఎస్టేట్ గొడవలు చేస్తూ కమిషన్లు తీసుకోవడం రాఘవేంద్రకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
రామకృష్ణ కూడా తాను సూసైడ్ చేసుకునే ముందు తీసిన సెల్ఫీ వీడియోలో ఇదే విషయం చెప్పారు.తన భార్యను రాఘవేంద్ర తీసుకురమ్మన్నాడని ఆరోపించారు.
వనమా రాఘవేంద్ర చేసిన పనితో ప్రస్తుతం ఆయన తండ్రి కొత్తగూడెం ఎమ్మెల్యే అయిన వనమా వెంకటేశ్వరావుకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి.ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు వనమా వెంకటేశ్వర రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.2009, 2014 ఎన్నికల్లో ఓడిపోయిన వనమా ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు.
ఈ సారి తాను గెలిచి పార్టీ కూడా అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి గ్యారంటీ అనుకుంటున్న తరుణంలో వనమా వెంకటేశ్వర రావు కుమారుడు చేసిన పనికి ఇన్ని రోజులు సంపాధించుకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది.ఇక వనమాకు మంత్రి పదవి ఏమో కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయేలా కనిపిస్తోంది.అనేక పార్టీలతో పాటు సొంత పార్టీలోని కొందరు నాయకులు కూడా వనమాను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమని అడుగుతున్నారట.
వనమాను పార్టీలో ఉంచుకుంటే తమ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వారు భావిస్తున్నారు.