వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాం ముస్లిం మైనారిటీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ఆస్తులను పరిరక్షిస్తూ ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ అన్నారు.

వేములవాడ పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అక్రమ్ గురువారం హైదరాబాదులోని రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకము కలిశారు.

శాలువాతో సత్కరించారు.అనంతరం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ ఇటీవలే వేములవాడ పట్టణ ముస్లిం కమిటీకి జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడుగా గెలుపొందిన మొహమ్మద్ అక్రమ్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అజ్మతుల్లా హుస్సేన్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలోని వక్ఫ్ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని వక్ఫ్ భూములను సర్వే చేయించి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై జిల్లా కలెక్టర్ తో చర్చించి రిజిస్ట్రేషన్ లను రద్దు చేయిస్తామన్నారు.

కార్యక్రమంలో బషీర్ భాయ్, కలీం పాషా, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
సిరిసిల్ల 17వ బెటాలియన్ లో వస్తువుల వేలం : బెటాలియన్ కమాండెంట్ ఎస్ . శ్రీనివాస రావు

Latest Rajanna Sircilla News